ఎంత వెూహించినాఁడే నే నేమిబాఁతే తనకు
(॥పల్లవి॥)
ఎంత వెూహించినాఁడే నే నేమిబాఁతే తనకు
మంతనములాడీని మాఁటికి మాఁటికిని
(॥॥)
బలిమి నాగుబ్బల పై బన్న సరికంఠమాల
పలుమారు లెక్కవెట్టీ పయ్యద దీసి
మెలుపు తోడ నొసలి మీఁది కస్తూరిబొట్టు
కొలఁదికి దిద్దీ తనకొనగోరను
(॥॥)
చందపునా కొప్పులోని సంపెంగ పూవులు
చెంది వాసన చూచీని ముందల వట్టి
ముందరి నాకుచ్చెలపై మొలనూలి మొగపులు
అందములు చూచీఁ దనహస్తమునను
(॥॥)
పరగ నాముంజేతుల పగడాల చేఁకట్టు
గొరబై విలువ సేసీ కొంగు పైఁ గప్పి
యిరవై శ్రీ వేంకటేశుఁ డేలి నన్నుఁ జెలులార
అరదీఁ దమ్ముల మిది యట్టె నాపుక్కిటను
(||pallavi||)
ĕṁta vĕూhiṁchinām̐ḍe ne nemibām̐te tanagu
maṁtanamulāḍīni mām̐ṭigi mām̐ṭigini
(||||)
balimi nāgubbala pai banna sarigaṁṭhamāla
palumāru lĕkkavĕṭṭī payyada dīsi
mĕlubu toḍa nŏsali mīm̐di kastūribŏṭṭu
kŏlam̐digi diddī tanagŏnagoranu
(||||)
saṁdabunā kŏppuloni saṁpĕṁga pūvulu
sĕṁdi vāsana sūsīni muṁdala vaṭṭi
muṁdari nāguchchĕlabai mŏlanūli mŏgabulu
aṁdamulu sūsīm̐ danahastamunanu
(||||)
paraga nāmuṁjedula pagaḍāla sem̐kaṭṭu
gŏrabai viluva sesī kŏṁgu paim̐ gappi
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍeli nannum̐ jĕlulāra
aradīm̐ dammula midi yaṭṭĕ nābukkiḍanu