ఎంత వెూహవెూ నీకీ ఇంతి మీఁదను
(॥పల్లవి॥)
ఎంత వెూహవెూ నీకీ ఇంతి మీఁదను
వింత వింత వేడుకల విఱ్ఱవీఁగేవు
(॥॥)
తరుణిగుబ్బలు నీకుఁ దలగడబిల్లలుగా-
నొరగుకొన్నాఁడవు వుబ్బున నీవు
దొరవై పయ్యదకొంగు దోమతెరబాగుగ
సరుగ మాఁటు సేసుక జాణవై వున్నాఁడవు
(॥॥)
భామినితొడలు నీకు పట్టెమంచములాగున-
నాముకొని పవ్వళించే వప్పటి నీవు
గోముతోడ పట్టుచీర కుచ్చెల పరుపుగాఁగ
కామించి ఇట్టె కోడెకాఁడవై వున్నాఁడవు
(॥॥)
వనితకాఁగిలి నీకు వాసన చప్పరముగ-
నునికి సేసుకున్నాఁడ వొద్దికై నీవు
యెనసితివి శ్రీ వేంకటేశ యలమేల్మంగను
అనిశము సింగారరాయఁడవై వున్నాఁడవు
(||pallavi||)
ĕṁta vĕూhavĕూ nīgī iṁti mīm̐danu
viṁta viṁta veḍugala viṭravīm̐gevu
(||||)
taruṇigubbalu nīgum̐ dalagaḍabillalugā-
nŏragugŏnnām̐ḍavu vubbuna nīvu
dŏravai payyadagŏṁgu domadĕrabāguga
saruga mām̐ṭu sesuga jāṇavai vunnām̐ḍavu
(||||)
bhāminidŏḍalu nīgu paṭṭĕmaṁchamulāguna-
nāmugŏni pavvaḽiṁche vappaḍi nīvu
gomudoḍa paṭṭusīra kuchchĕla parubugām̐ga
kāmiṁchi iṭṭĕ koḍĕgām̐ḍavai vunnām̐ḍavu
(||||)
vanidagām̐gili nīgu vāsana sapparamuga-
nunigi sesugunnām̐ḍa vŏddigai nīvu
yĕnasidivi śhrī veṁkaḍeśha yalamelmaṁganu
aniśhamu siṁgārarāyam̐ḍavai vunnām̐ḍavu