ఎంత వేగిరకత్తెవే యేమే నీవు
(॥పల్లవి॥)
ఎంత వేగిరకత్తెవే యేమే నీవు
చెంతనుండి వలపులఁ జిమ్మి రేఁచరాదా
(॥ఎంత॥)
అట్టె పానుపుపై నుండి యాతని నన్నుఁ జూచి
వొట్టేల పెట్టుకొనేవే వువిదా
యెట్టనెదుటఁ గూచుండి యేపున మాటమాటల
చుట్టరికము గలితేఁ జూపిచెప్పరాదా
(॥ఎంత॥)
మగఁడు నన్నన్నిటాను మన్నించఁగాఁ జూచి
మొగము వంచుకోనేలే ముదితా
నగుతా నాతనితోను నయములెల్లాఁ జూపి
తగవు గలిగితేను తలఁపించరాదా
(॥ఎంత॥)
చెలఁగి నన్నుఁగూడిన శ్రీవేంకటేశునిఁ జూచి
బలిమిఁ బైకొననేలే పడఁతీ
వెలయఁ బొందుసేసి వేళలు గాచుకవుండి
వలపు గలిగితేను వడ్డించుకొరాదా
(||pallavi||)
ĕṁta vegiragattĕve yeme nīvu
sĕṁtanuṁḍi valabulam̐ jimmi rem̐sarādā
(||ĕṁta||)
aṭṭĕ pānububai nuṁḍi yādani nannum̐ jūsi
vŏṭṭela pĕṭṭugŏneve vuvidā
yĕṭṭanĕduḍam̐ gūsuṁḍi yebuna māḍamāḍala
suṭṭarigamu galidem̐ jūbisĕpparādā
(||ĕṁta||)
magam̐ḍu nannanniḍānu manniṁcham̐gām̐ jūsi
mŏgamu vaṁchugonele mudidā
nagudā nādanidonu nayamulĕllām̐ jūbi
tagavu galigidenu talam̐piṁcharādā
(||ĕṁta||)
sĕlam̐gi nannum̐gūḍina śhrīveṁkaḍeśhunim̐ jūsi
balimim̐ baigŏnanele paḍam̐tī
vĕlayam̐ bŏṁdusesi veḽalu gāsugavuṁḍi
valabu galigidenu vaḍḍiṁchugŏrādā