ఎంత వేగిరకాఁడే యేమే వీఁడు
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడే యేమే వీఁడు
కాంతరో తాఁ జెప్పితేను కాదనేనా నేను
(॥ఎంత॥)
నొడిగినమాఁట నోటిలోనే వుండఁగాను
తొడిఁబడ నామోవి దొమ్మిసేసీనే
చిడుముడిఁ జేసన్న చేతిలోనే వుండఁగాను
అడరి పై కొని నన్ను నలమీనే వీఁడు
(॥ఎంత॥)
తలఁపులో మన తనువులో నుండఁగాను
కళవట్టించి చొక్కించి కాకుసేసీనే
చలిమిఁ బయ్యద కొంగు చన్నులపై నుండఁగాను
చిలుకుగోర నూఁది చిన్నలుసేసీనే
(॥ఎంత॥)
పట్టినట్టికాఁగిలి పట్టినట్టే వుండఁగాను
బెట్టుగఁ బెక్కుబందాలఁ బెనఁగీనే
యిట్టె శ్రీవేంకటేశుఁడింత సేసీ నన్నుఁగూడె
అట్టె తా నెంతయినా నలయఁడే వీఁడు
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍe yeme vīm̐ḍu
kāṁtaro tām̐ jĕppidenu kādanenā nenu
(||ĕṁta||)
nŏḍiginamām̐ṭa noḍilone vuṁḍam̐gānu
tŏḍim̐baḍa nāmovi dŏmmisesīne
siḍumuḍim̐ jesanna sedilone vuṁḍam̐gānu
aḍari pai kŏni nannu nalamīne vīm̐ḍu
(||ĕṁta||)
talam̐pulo mana tanuvulo nuṁḍam̐gānu
kaḽavaṭṭiṁchi sŏkkiṁchi kāgusesīne
salimim̐ bayyada kŏṁgu sannulabai nuṁḍam̐gānu
silugugora nūm̐di sinnalusesīne
(||ĕṁta||)
paṭṭinaṭṭigām̐gili paṭṭinaṭṭe vuṁḍam̐gānu
bĕṭṭugam̐ bĕkkubaṁdālam̐ bĕnam̐gīne
yiṭṭĕ śhrīveṁkaḍeśhum̐ḍiṁta sesī nannum̐gūḍĕ
aṭṭĕ tā nĕṁtayinā nalayam̐ḍe vīm̐ḍu