ఎంత వేగిరకాఁడవు యింతుల యడాటాన
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యింతుల యడాటాన
వింతవింత చేఁతలను వీరిడిఁ జేసేవు
(॥ఎంత॥)
మేరమీరి యాపె నీతో మేలములాడెనంటా
తేరకొనఁజూచి కొప్పు జారఁదీసేవు
గోర గీరి యట్టె నిన్ను కోపగించి అట్టెనంటా
సారెసారెఁ గొంగువట్టి సాదించేవు
(॥ఎంత॥)
బింకముగా నాపె నీతో బెట్టుగాఁ బెనఁగెనంటా
పొంకాన పూవుబంతిని పూఁచి వేసేవు
అంకెల నంతలో నిన్ను అద్దలించి చూచెనంటా
సంకెలేక వుద్దండాన చదురులాడేవు
(॥ఎంత॥)
గయ్యాళితనాన నాపె కాఁగిలించుకొనెనంటా
వుయ్యాలమంచముమీఁది కొగిఁదేసేవు
నెయ్యపు శ్రీవేంకటేశ నిన్నిట్టె చొక్కించెనంటా
తియ్యనిమోవి యిచ్చి దీకొనేవు
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yiṁtula yaḍāḍāna
viṁtaviṁta sem̐talanu vīriḍim̐ jesevu
(||ĕṁta||)
meramīri yābĕ nīdo melamulāḍĕnaṁṭā
teragŏnam̐jūsi kŏppu jāram̐dīsevu
gora gīri yaṭṭĕ ninnu kobagiṁchi aṭṭĕnaṁṭā
sārĕsārĕm̐ gŏṁguvaṭṭi sādiṁchevu
(||ĕṁta||)
biṁkamugā nābĕ nīdo bĕṭṭugām̐ bĕnam̐gĕnaṁṭā
pŏṁkāna pūvubaṁtini pūm̐si vesevu
aṁkĕla naṁtalo ninnu addaliṁchi sūsĕnaṁṭā
saṁkĕlega vuddaṁḍāna sadurulāḍevu
(||ĕṁta||)
gayyāḽidanāna nābĕ kām̐giliṁchugŏnĕnaṁṭā
vuyyālamaṁchamumīm̐di kŏgim̐desevu
nĕyyabu śhrīveṁkaḍeśha ninniṭṭĕ sŏkkiṁchĕnaṁṭā
tiyyanimovi yichchi dīgŏnevu