ఎంత వేగిరకాఁడవు యిదేమయ్యా
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యిదేమయ్యా
కాంత నూరకే నీవు గయ్యాళిఁ జేసేవు
(॥ఎంత॥)
వుదుటునఁ జెలి నిన్ను నొడివట్టి తీసెనంటా
పెదవులనే తిట్టేవు ప్రియురాలిని
కదిసి నీతురుము గక్కన జూరఁదీసె నంటా
పొదిగొని యీకె నిట్టె బొమ్మల జంకించేవు
(॥ఎంత॥)
చేరి నీతోఁ బెనఁగుతా చెమటపైఁ జిందె నంటా
ఆరీతిఁ గన్నులనే అదలించేవు
కూరిమిఁ గైదండ ఇచ్చి గోరు సోకించె నంటా
నేరుపరితనమున నెపాలు వేసేవు
(॥ఎంత॥)
గరిమఁ జన్నుల నూఁది కాఁగిలించుకొనెనంటా
గరువపు మాటలాడి గద్దించేవు
యిరవుగ శ్రీవేంకటేశ యింతి నేలితివి
విరులను వేసె నంటా వెక్కసా లాడేవు
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yidemayyā
kāṁta nūrage nīvu gayyāḽim̐ jesevu
(||ĕṁta||)
vuduḍunam̐ jĕli ninnu nŏḍivaṭṭi tīsĕnaṁṭā
pĕdavulane tiṭṭevu priyurālini
kadisi nīdurumu gakkana jūram̐dīsĕ naṁṭā
pŏdigŏni yīgĕ niṭṭĕ bŏmmala jaṁkiṁchevu
(||ĕṁta||)
seri nīdom̐ bĕnam̐gudā sĕmaḍabaim̐ jiṁdĕ naṁṭā
ārīdim̐ gannulane adaliṁchevu
kūrimim̐ gaidaṁḍa ichchi goru sogiṁchĕ naṁṭā
nerubaridanamuna nĕbālu vesevu
(||ĕṁta||)
garimam̐ jannula nūm̐di kām̐giliṁchugŏnĕnaṁṭā
garuvabu māḍalāḍi gaddiṁchevu
yiravuga śhrīveṁkaḍeśha yiṁti nelidivi
virulanu vesĕ naṁṭā vĕkkasā lāḍevu