Emta vegiragaamdavu yeraa neevu

ఎంత వేగిరకాఁడవు యేరా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేరా నీవు
పంత మంతే కలితేను బతికేము మనము

(॥ఎంత॥)
మొకము చూడఁగానే మొరఁగేవు నాతోడఁ
నెకసక్కేలకు నట్టే యేరా నీవు
వొకటంటే నొకటని వొట్టులేల పెట్టేవు
నికలంకుఁడవేయైతే నీకేల వెఱపు

(॥ఎంత॥)
పొదిగి నే నుండఁగానే బూటకాలు సేసేవు
యెదురెదురుకట్ల నేరా నీవు
యిది నే సోదించితేను యెగ్గులేల పట్టేవు
మదిలో నిజముండితే మరియేల వెఱపు

(॥ఎంత॥)
చెక్కులు నే నొక్కితేను సిగ్గులు వడేవు నీవు
యిక్కడ శ్రీవేంకటేశ యేరా నీవు
వొక్కమనసాయ నాకు వూరక నిన్నంటినేను
చిక్కనాయ నీవలపు చెల్ల దేలవెఱపు

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yerā nīvu
paṁta maṁte kalidenu badigemu manamu

(||ĕṁta||)
mŏgamu sūḍam̐gāne mŏram̐gevu nādoḍam̐
nĕgasakkelagu naṭṭe yerā nīvu
vŏgaḍaṁṭe nŏgaḍani vŏṭṭulela pĕṭṭevu
nigalaṁkum̐ḍaveyaide nīgela vĕṟabu

(||ĕṁta||)
pŏdigi ne nuṁḍam̐gāne būḍagālu sesevu
yĕdurĕdurugaṭla nerā nīvu
yidi ne sodiṁchidenu yĕggulela paṭṭevu
madilo nijamuṁḍide mariyela vĕṟabu

(||ĕṁta||)
sĕkkulu ne nŏkkidenu siggulu vaḍevu nīvu
yikkaḍa śhrīveṁkaḍeśha yerā nīvu
vŏkkamanasāya nāgu vūraga ninnaṁṭinenu
sikkanāya nīvalabu sĕlla delavĕṟabu