ఎంత వేగిరకాఁడవు యేరా నీవు
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేరా నీవు
యింతులతోనే బలిమి యేలరా నీవు
(॥ఎంత॥)
నొచ్చీనోవని మాట నోరిలోనే వుండఁగాను
యెచ్చుకొందు లాడవచ్చే వేరా నీవు
మచ్చికతోడికోపము మనసులో నుండఁగాను
వచ్చేవు వాదులకు వద్దురా నీవు
(॥ఎంత॥)
చిఱుచేఁదులయిన నవ్వు సెలవినే వుండఁగాను
యెఱిఁగెఱిఁగి తిట్టేవు యేరా నీవు
పొఱలేని జంకెనలు బొమ్మలనే వుండఁగాను
అఱు కమ్మి పెనఁగేవు అద్దిరా నీవూ
(॥ఎంత॥)
కాఁకలపొందుచూపు కన్నులనే వుండఁగాను
యేఁకటఁ దమకించేవు యేరా నీవు
వాఁకల శ్రీవేంకటేశ వద్ద నిన్నుఁ గూడఁగాను
పూకొని మై మఱచేవు వుండుండే నీవు
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yerā nīvu
yiṁtuladone balimi yelarā nīvu
(||ĕṁta||)
nŏchchīnovani māḍa norilone vuṁḍam̐gānu
yĕchchugŏṁdu lāḍavachche verā nīvu
machchigadoḍigobamu manasulo nuṁḍam̐gānu
vachchevu vādulagu vaddurā nīvu
(||ĕṁta||)
siṟusem̐dulayina navvu sĕlavine vuṁḍam̐gānu
yĕṟim̐gĕṟim̐gi tiṭṭevu yerā nīvu
pŏṟaleni jaṁkĕnalu bŏmmalane vuṁḍam̐gānu
aṟu kammi pĕnam̐gevu addirā nīvū
(||ĕṁta||)
kām̐kalabŏṁdusūbu kannulane vuṁḍam̐gānu
yem̐kaḍam̐ damagiṁchevu yerā nīvu
vām̐kala śhrīveṁkaḍeśha vadda ninnum̐ gūḍam̐gānu
pūgŏni mai maṟasevu vuṁḍuṁḍe nīvu