Emta vegiragaamdavu yemi seppedi

ఎంత వేగిరకాఁడవు యేమి చెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమి చెప్పేది
మంతనాన బుజ్జగించి మన్నించరాదా

(॥ఎంత॥)
అతివ నీవద్దనుండి ఆకుమడిచియ్యఁగాను
కత చెప్పమని యెంత కక్కసించేవు
మితిమీరి సిగ్గుతోను మెల్లని నీకు మొక్కఁగా
చతురతలు నెరపి చన్నులే లంటేవు

(॥ఎంత॥)
నెట్టుకొని బత్తితోడ నీకుఁ బాదాలొత్తఁగాను
అట్టె మోవిమ్మని యాల ఆనవెట్టేవు
చిట్టకము లేక నిన్నుఁ జెక్కునొక్కి వేఁడుకోఁగా
వొట్టుక వలపులెంత వొడిఁబెట్టేవు

(॥ఎంత॥)
అక్కరతో నలపార నాలవట్ట మిడఁగాను
పక్కఁ బండుమని యెంత బాఁతి పడేవు
యిక్కడ శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
గక్కన వావి చెప్పఁగాఁ గాఁగిలించేవు

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemi sĕppedi
maṁtanāna bujjagiṁchi manniṁcharādā

(||ĕṁta||)
adiva nīvaddanuṁḍi āgumaḍisiyyam̐gānu
kada sĕppamani yĕṁta kakkasiṁchevu
midimīri siggudonu mĕllani nīgu mŏkkam̐gā
saduradalu nĕrabi sannule laṁṭevu

(||ĕṁta||)
nĕṭṭugŏni battidoḍa nīgum̐ bādālŏttam̐gānu
aṭṭĕ movimmani yāla ānavĕṭṭevu
siṭṭagamu lega ninnum̐ jĕkkunŏkki vem̐ḍugom̐gā
vŏṭṭuga valabulĕṁta vŏḍim̐bĕṭṭevu

(||ĕṁta||)
akkarado nalabāra nālavaṭṭa miḍam̐gānu
pakkam̐ baṁḍumani yĕṁta bām̐ti paḍevu
yikkaḍa śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
gakkana vāvi sĕppam̐gām̐ gām̐giliṁchevu