ఎంత వేగిరకాఁడవు యేమి సేతువొ
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమి సేతువొ
పంతగాఁడ ఇట్లయితే పనులెల్లా దక్కెను
(॥ఎంత॥)
నట్టుకొట్టి నాలో నే నవ్వితేఁ దిట్టవచ్చేవు
పట్టితే నేమి సేతువో బాపురా నీవు
వెట్టైన చెమట దీర విసరితేఁ గసరేవు
ఇట్టె గురు లేడవంటే నిఁక నేమిసేతువో
(॥ఎంత॥)
తప్పక నేఁ జూచినదే తగలి యెగ్గులెంచేవు
ఇప్పుడే వెంగెమాడితే నేమి సేతువో
వొప్పుగా సన్న సేసితో వొకటొక టాడేవు
తప్పులే నిన్నుఁ బట్టితే దాని కేమి సేతువో
(॥ఎంత॥)
మోవి ఇచ్చినంతలోనే మోనానా సిగ్గువడేవు
యీవల గంటిరేఁచితే నేమిసేతువో
వేవేలు వచ్చెను శ్రీ వేంకటేశ నీవు నన్ను
కైవసమై కూడితివి ఘనతెంత సేతువో
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemi seduvŏ
paṁtagām̐ḍa iṭlayide panulĕllā dakkĕnu
(||ĕṁta||)
naṭṭugŏṭṭi nālo ne navvidem̐ diṭṭavachchevu
paṭṭide nemi seduvo bāburā nīvu
vĕṭṭaina sĕmaḍa dīra visaridem̐ gasarevu
iṭṭĕ guru leḍavaṁṭe nim̐ka nemiseduvo
(||ĕṁta||)
tappaga nem̐ jūsinade tagali yĕggulĕṁchevu
ippuḍe vĕṁgĕmāḍide nemi seduvo
vŏppugā sanna sesido vŏgaḍŏga ṭāḍevu
tappule ninnum̐ baṭṭide dāni kemi seduvo
(||ĕṁta||)
movi ichchinaṁtalone monānā sigguvaḍevu
yīvala gaṁṭirem̐side nemiseduvo
vevelu vachchĕnu śhrī veṁkaḍeśha nīvu nannu
kaivasamai kūḍidivi ghanadĕṁta seduvo