Emta vegiragaamdavu yemayyaa neevu

ఎంత వేగిరకాఁడవు యేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమయ్యా నీవు
చెంతనుండి వూడిగాలు సేయనియ్యవా

(॥॥)
సముకాన మొక్కఁ గానే సరసపుమాట లాడి
చెమరించఁ జేసేవు చెక్కులెల్లాను
తమితో వీడినకొప్పు తగ నే ముడువఁ గానే
కొమరెనాచన్ను లంటి భ్రమయించేవు

(॥॥)
వొత్తఁ గానే పాదాలు నావొడిమీఁ ద నీవు వేసి
చిత్తమెల్లాఁ గరఁగించి చిమ్మిరేఁచేవు
హత్తి బాగా లందిచ్చి ఆకుమడిచియ్యఁ గానే
తత్తరాన మోమి యాని తమకింపించేవు

(॥॥)
కలయఁ గ నీమేనఁ గస్తూరి వూయఁ గానే
బలిమిఁ గాఁగిట నించి పచ్చిసేసేవు
నిలిచి శ్రీవేంకటేశ నీకుఁ గప్రమియ్యఁ గానే
వెలయ వింతరతుల వెరగందించేవు

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemayyā nīvu
sĕṁtanuṁḍi vūḍigālu seyaniyyavā

(||||)
samugāna mŏkkam̐ gāne sarasabumāḍa lāḍi
sĕmariṁcham̐ jesevu sĕkkulĕllānu
tamido vīḍinagŏppu taga ne muḍuvam̐ gāne
kŏmarĕnāsannu laṁṭi bhramayiṁchevu

(||||)
vŏttam̐ gāne pādālu nāvŏḍimīm̐ da nīvu vesi
sittamĕllām̐ garam̐giṁchi simmirem̐sevu
hatti bāgā laṁdichchi āgumaḍisiyyam̐ gāne
tattarāna momi yāni tamagiṁpiṁchevu

(||||)
kalayam̐ ga nīmenam̐ gastūri vūyam̐ gāne
balimim̐ gām̐giḍa niṁchi pachchisesevu
nilisi śhrīveṁkaḍeśha nīgum̐ gapramiyyam̐ gāne
vĕlaya viṁtaradula vĕragaṁdiṁchevu