Emta vegiragaamdavu yemayyaa

ఎంత వేగిరకాఁడవు యేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమయ్యా
కాంతుఁడవు ఆఁటదానిఁ గాకు సేయఁదగునా

(॥ఎంత॥)
చనవుగలదుగాన సరసములాడెఁ జెలి
పెనఁగి కుచము లింత పిసుకుదురా
ననిచి వావి చెప్పుఁగా నవ్వులు నీతో నవ్వె
చెనకి ఇంతేసి నీవు సిగ్గుపడఁ జేతురా

(॥ఎంత॥)
నీవు మన్నింతువుగాన నిమ్మపంట వేసె నింతి
మోవి గంటిసేసి పంతములాడుదురా
దేవులుగనక నిన్నుఁ దిలకించి కాలుదొక్కె
సోవలుగ మానము పై సోఁకఁగఁ దిట్టుదురా

(॥ఎంత॥)
చుట్టమ వుగాన నిన్ను సొలసి సలిగె చూపె
ఆట్టె రతిఁ గూడికూడి అలఇంతురా
నెట్టన శ్రీవేంకటేశ నీకుఁ దననేర్పు చెప్పె
బట్టబయలుగా దిట్టె పచ్చిగా నాడుదురా

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemayyā
kāṁtum̐ḍavu ām̐ṭadānim̐ gāgu seyam̐dagunā

(||ĕṁta||)
sanavugaladugāna sarasamulāḍĕm̐ jĕli
pĕnam̐gi kusamu liṁta pisugudurā
nanisi vāvi sĕppum̐gā navvulu nīdo navvĕ
sĕnagi iṁtesi nīvu siggubaḍam̐ jedurā

(||ĕṁta||)
nīvu manniṁtuvugāna nimmabaṁṭa vesĕ niṁti
movi gaṁṭisesi paṁtamulāḍudurā
devuluganaga ninnum̐ dilagiṁchi kāludŏkkĕ
sovaluga mānamu pai som̐kam̐gam̐ diṭṭudurā

(||ĕṁta||)
suṭṭama vugāna ninnu sŏlasi saligĕ sūbĕ
āṭṭĕ radim̐ gūḍigūḍi ala̮iṁturā
nĕṭṭana śhrīveṁkaḍeśha nīgum̐ dananerbu sĕppĕ
baṭṭabayalugā diṭṭĕ pachchigā nāḍudurā