Emta vegiragaamdavu yemamdu nenu

ఎంత వేగిరకాఁడవు యేమందు నేను
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడవు యేమందు నేను
వింత వింత రతులను వినోదించేవు

(॥ఎంత॥)
వెలఁది నిన్ను దగ్గరి విన్నపాలు సేయఁగాను
చిలిమి బలిమి నాపెచన్నులంటేవు
పలుమారు వేడుకతో బాగాలు చేతికియ్యఁగా
మొలక నవ్వులతోడ మోవి యానేవు

(॥ఎంత॥)
పనివూని నీ కాపె పాదములొత్త రాఁగాను
చెనకి కుచ్చెలమీఁదఁ జెయి చాఁచేవు
వినయముతో నీకు విరులు ముడువఁగాను
మనసు పట్టఁగలేక మర్మము లంటేవు

(॥ఎంత॥)
వుక్కుమీరి యాపె నీకు వూడిగాలు సేయఁగాను
పిక్కటిలఁ గాఁగిటను బిగియించేవు
యిక్కడ శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
చొక్కుచు నాపెతోడ నా సుద్దులు చెప్పేవు

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍavu yemaṁdu nenu
viṁta viṁta radulanu vinodiṁchevu

(||ĕṁta||)
vĕlam̐di ninnu daggari vinnabālu seyam̐gānu
silimi balimi nābĕsannulaṁṭevu
palumāru veḍugado bāgālu sedigiyyam̐gā
mŏlaga navvuladoḍa movi yānevu

(||ĕṁta||)
panivūni nī kābĕ pādamulŏtta rām̐gānu
sĕnagi kuchchĕlamīm̐dam̐ jĕyi sām̐sevu
vinayamudo nīgu virulu muḍuvam̐gānu
manasu paṭṭam̐galega marmamu laṁṭevu

(||ĕṁta||)
vukkumīri yābĕ nīgu vūḍigālu seyam̐gānu
pikkaḍilam̐ gām̐giḍanu bigiyiṁchevu
yikkaḍa śhrīveṁkaḍeśha yelidivi nannu nem̐ḍu
sŏkkusu nābĕdoḍa nā suddulu sĕppevu