ఎంత వేగిరకాఁడమ్మ ఇదివో తాను
(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడమ్మ ఇదివో తాను
పొంత నావద్దఁ గూచుండి బోధించీఁ దాను
(॥ఎంత॥)
సిగ్గువడి చెక్కుచేత చింతించుకుండఁగాను
వెగ్గళించి నాపైఁ జేయివేసీ తాను
దగ్గరి ఇందరిలోన తలవంచుకుండఁగాను
ఆగ్గలము వేఁడుకొని ఆదరించీ తాను
(॥ఎంత॥)
మానాపతితనాన మాటలాడకుండఁగాను
ఆనుకొని యాడోకత లడిగీఁ దాను
పానుపుపైఁ గూచుండి పంతముతో నుండఁగాను
మేను ముట్టి సారె సారె మేలమాడీ తాను
(॥ఎంత॥)
ఇయ్యకొని తనకాఁగి లిచ్చగించి వుండఁగాను
పయ్యదంటుచును వొడఁబరచీఁ దాను
నెయ్యపు ఆలమేల్మంగ నేను తా శ్రీవేంకటేశుఁ -
డియ్యేడఁ గరుణఁ గూడె ఇన్నిటాఁదాఁను-
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍamma idivo tānu
pŏṁta nāvaddam̐ gūsuṁḍi bodhiṁchīm̐ dānu
(||ĕṁta||)
sigguvaḍi sĕkkuseda siṁtiṁchuguṁḍam̐gānu
vĕggaḽiṁchi nābaim̐ jeyivesī tānu
daggari iṁdarilona talavaṁchuguṁḍam̐gānu
āggalamu vem̐ḍugŏni ādariṁchī tānu
(||ĕṁta||)
mānābadidanāna māḍalāḍaguṁḍam̐gānu
ānugŏni yāḍogada laḍigīm̐ dānu
pānububaim̐ gūsuṁḍi paṁtamudo nuṁḍam̐gānu
menu muṭṭi sārĕ sārĕ melamāḍī tānu
(||ĕṁta||)
iyyagŏni tanagām̐gi lichchagiṁchi vuṁḍam̐gānu
payyadaṁṭusunu vŏḍam̐barasīm̐ dānu
nĕyyabu ālamelmaṁga nenu tā śhrīveṁkaḍeśhum̐ -
ḍiyyeḍam̐ garuṇam̐ gūḍĕ inniḍām̐dām̐nu-