(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడ వేమోయి
పంతగాఁడ వింతలోనే పదరకువోయీ
(॥ఎంత॥)
చెక్కు నొక్కఁ బొద్దు లేదో చేఁత సేయఁ బొద్దు లేదో
అక్కర దీరఁగ మాటలాడవోయి
యిక్కు వంటఁ బొద్దు లేదో యేఁటికైనా బొద్దు లేదో
యెక్కువ కప్పురవీడె మిందవోయి
(॥ఎంత॥)
చేయి చాఁచఁ బొద్దు లేదో సేస వెట్టఁ బొద్దు లేదో
సోయగపు నీ మోము చూపవోయి
మోయ నవ్వఁ బొద్దు లేదో మోవి యానఁ బొద్దు లేదో
నీ యలపు దీరఁ గొంత నెత్తమాడవోయి
(॥ఎంత॥)
పచ్చిసేయఁ బొద్దు లేదో పైకొనఁగఁ బొద్దు లేదో
యిచ్చగాఁగఁ గిన్నెర వాయించవోయి
కుచ్చి నన్నుఁ గౌఁగిటనుఁ గూడితి శ్రీవేంకటేశ
మచ్చికె యీ ప్రేమ మిట్టే మఱవకువోయి
(||pallavi||)
ĕṁta vegiragām̐ḍa vemoyi
paṁtagām̐ḍa viṁtalone padaraguvoyī
(||ĕṁta||)
sĕkku nŏkkam̐ bŏddu ledo sem̐ta seyam̐ bŏddu ledo
akkara dīram̐ga māḍalāḍavoyi
yikku vaṁṭam̐ bŏddu ledo yem̐ṭigainā bŏddu ledo
yĕkkuva kappuravīḍĕ miṁdavoyi
(||ĕṁta||)
seyi sām̐sam̐ bŏddu ledo sesa vĕṭṭam̐ bŏddu ledo
soyagabu nī momu sūbavoyi
moya navvam̐ bŏddu ledo movi yānam̐ bŏddu ledo
nī yalabu dīram̐ gŏṁta nĕttamāḍavoyi
(||ĕṁta||)
pachchiseyam̐ bŏddu ledo paigŏnam̐gam̐ bŏddu ledo
yichchagām̐gam̐ ginnĕra vāyiṁchavoyi
kuchchi nannum̐ gaum̐giḍanum̐ gūḍidi śhrīveṁkaḍeśha
machchigĕ yī prema miṭṭe maṟavaguvoyi