Emta vegiragaamda vemayyaa neevu

ఎంత వేగిరకాఁడ వేమయ్యా నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడ వేమయ్యా నీవు
వంతురాక తొలుతనే వలపు చల్లేవు

(॥ఎంత॥)
మొక్కేనని చేతులు మొగి నుద్యేగించఁగానే
దిక్కున నందుకు ముందే దీవించేవు
అక్కరతో నవ్వు నవ్వ నాఇతపడఁగానే
చక్కఁగా చేముంచి నీవు సరసమాడేవు

(॥ఎంత॥)
తొడిఁబడ మాటలాడ దొరకొనే ననఁగానే
చిడుముడి నప్పుడే మెచ్చితిననేవు
అడరి నీమోము చూడ ఆసపడేననఁగానే
జడియక నామోము సారెఁ దోఁగిచూచేవు

(॥ఎంత॥)
చన్నుల నొత్తేనని సవరించుకొనఁగానే
వున్నతిఁ గాఁగిట నించి వొద్దికయ్యేవు
చెన్నుగా శ్రీవేంకటేశ సేసవెట్టేననఁగానే
నన్ను నేలి నీవు కంకణము గట్టేవు

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍa vemayyā nīvu
vaṁturāga tŏludane valabu sallevu

(||ĕṁta||)
mŏkkenani sedulu mŏgi nudyegiṁcham̐gāne
dikkuna naṁdugu muṁde dīviṁchevu
akkarado navvu navva nāidabaḍam̐gāne
sakkam̐gā semuṁchi nīvu sarasamāḍevu

(||ĕṁta||)
tŏḍim̐baḍa māḍalāḍa dŏragŏne nanam̐gāne
siḍumuḍi nappuḍe mĕchchidinanevu
aḍari nīmomu sūḍa āsabaḍenanam̐gāne
jaḍiyaga nāmomu sārĕm̐ dom̐gisūsevu

(||ĕṁta||)
sannula nŏttenani savariṁchugŏnam̐gāne
vunnadim̐ gām̐giḍa niṁchi vŏddigayyevu
sĕnnugā śhrīveṁkaḍeśha sesavĕṭṭenanam̐gāne
nannu neli nīvu kaṁkaṇamu gaṭṭevu