Emta vegiragaamda vemayya neevu

ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాఁడ వేమయ్య నీవు
మంతనాన యెట్లుండిన మచ్చిక లమరును

(॥ఎంత॥)
సిగ్గువడ్డకోమలిని చెఱఁగువట్టి తీసేవు
యెగ్గువట్టి తిట్టితేను యేమిసేసేవు
వొగ్గక ముసుఁగిడఁగ వొడివట్టి పెనఁగేవు
బగ్గనఁ బాదమంటితే పడఁతులు నగరా

(॥ఎంత॥)
పఱపుపై నున్న దాని బలిమిసేయఁ జూచేవు
యెఱిఁగి గోర గీరితే యేమిసేసేవు
చిఱునవ్వు నవ్వితే చేరి యానలు వెట్టేవు
నెఱయా నొట్టువెట్టితే నీవు తిద్దఁగలవా

(॥ఎంత॥)
కవకవనవ్వే దానిఁ గాఁగిలించి కూడేవు
యివలఁ బచ్చివేసితే నేమిసేసేవు
జవళి శ్రీవేంకటేశ సతినిఁ(ని?) త మీరితివి
వివరించి కొసరితే వెల్లవిరిగాదా

(||pallavi||)
ĕṁta vegiragām̐ḍa vemayya nīvu
maṁtanāna yĕṭluṁḍina machchiga lamarunu

(||ĕṁta||)
sigguvaḍḍagomalini sĕṟam̐guvaṭṭi tīsevu
yĕgguvaṭṭi tiṭṭidenu yemisesevu
vŏggaga musum̐giḍam̐ga vŏḍivaṭṭi pĕnam̐gevu
bagganam̐ bādamaṁṭide paḍam̐tulu nagarā

(||ĕṁta||)
paṟabubai nunna dāni balimiseyam̐ jūsevu
yĕṟim̐gi gora gīride yemisesevu
siṟunavvu navvide seri yānalu vĕṭṭevu
nĕṟayā nŏṭṭuvĕṭṭide nīvu tiddam̐galavā

(||ĕṁta||)
kavagavanavve dānim̐ gām̐giliṁchi kūḍevu
yivalam̐ bachchiveside nemisesevu
javaḽi śhrīveṁkaḍeśha sadinim̐(ni?) ta mīridivi
vivariṁchi kŏsaride vĕllavirigādā