Emta vegiragaadavu yemamdu ninnu

ఎంత వేగిరకాడవు యేమందు నిన్ను
Language

(॥పల్లవి॥)
ఎంత వేగిరకాడవు యేమందు నిన్ను
మంతుకెక్క నీవారమే మన్నించవయ్యా

(॥ఎంత॥)
నమ్మిక నీమాటలకు నవ్వు వచ్చె నింతే పో
అమ్మరో నిన్ను గేలిసేఁయగ వచ్చేమా
చెమ్మఁజెమటలతోడి చెక్కులతో నంతలో నీఁ
వెమ్మెలకే కోపగించి విది యేఁటికయ్యా

(॥ఎంత॥)
దగ్గరేనీయాసలకుఁ దప్పక చూచితి నింతే
వెగ్గళించేనీమీఁది వెగేమా యిది
సిగ్గువడ్డమొగముతో చీఁదర వాఁదరలతో
నిగ్గుదేర మొరఁగేవు నీ విదేమయ్యా

(॥ఎంత॥)
సంగడి గూచుండఁగాను సరిపెనఁగితి మింతే
సంగతి మీరినయట్టి జాడ లేవి
ముంగిట శ్రీవేంకటేశ మోహించి కూడితి నన్ను
అంగవించి తనియవు అప్పటి నేలయ్యా

(||pallavi||)
ĕṁta vegiragāḍavu yemaṁdu ninnu
maṁtugĕkka nīvārame manniṁchavayyā

(||ĕṁta||)
nammiga nīmāḍalagu navvu vachchĕ niṁte po
ammaro ninnu gelisem̐yaga vachchemā
sĕmmam̐jĕmaḍaladoḍi sĕkkulado naṁtalo nīm̐
vĕmmĕlage kobagiṁchi vidi yem̐ṭigayyā

(||ĕṁta||)
daggarenīyāsalagum̐ dappaga sūsidi niṁte
vĕggaḽiṁchenīmīm̐di vĕgemā yidi
sigguvaḍḍamŏgamudo sīm̐dara vām̐daralado
niggudera mŏram̐gevu nī videmayyā

(||ĕṁta||)
saṁgaḍi gūsuṁḍam̐gānu saribĕnam̐gidi miṁte
saṁgadi mīrinayaṭṭi jāḍa levi
muṁgiḍa śhrīveṁkaḍeśha mohiṁchi kūḍidi nannu
aṁgaviṁchi taniyavu appaḍi nelayyā