(॥పల్లవి॥)
ఎంత వేడుకో యిది నీకు
కొంత చెలియ సిగ్గునఁ బొదలీని
(॥ఎంత॥)
వదనకమల మటు వంచుక నీతో
కదిసి మాఁటాడీఁ గలికి
పెదవులపయి నీవు పెంచిన చేఁతకు
కొదలుచు కడు సిగ్గునఁ బొదలీని
(॥ఎంత॥)
గక్కనఁ బయ్యద గప్పుక నీవద్ద
సుక్కుచు మెలఁగీ సుదతి
జక్కవ చన్నుల చంద్రుల నించఁగ
గుక్కుచు కడు సిగ్గునఁ బొదలీని
(॥ఎంత॥)
నిట్టూరుపులను నిలిపి నిలిపి నిను
గుట్టునఁ బొదిగీఁ గోమలి
యిట్టె శ్రీ వేంకటేశ నీ వెనయఁగ
గొట్టు గెలిచి సిగ్గునఁబొదలీని
(||pallavi||)
ĕṁta veḍugo yidi nīgu
kŏṁta sĕliya siggunam̐ bŏdalīni
(||ĕṁta||)
vadanagamala maḍu vaṁchuga nīdo
kadisi mām̐ṭāḍīm̐ galigi
pĕdavulabayi nīvu pĕṁchina sem̐tagu
kŏdalusu kaḍu siggunam̐ bŏdalīni
(||ĕṁta||)
gakkanam̐ bayyada gappuga nīvadda
sukkusu mĕlam̐gī sudadi
jakkava sannula saṁdrula niṁcham̐ga
gukkusu kaḍu siggunam̐ bŏdalīni
(||ĕṁta||)
niṭṭūrubulanu nilibi nilibi ninu
guṭṭunam̐ bŏdigīm̐ gomali
yiṭṭĕ śhrī veṁkaḍeśha nī vĕnayam̐ga
gŏṭṭu gĕlisi siggunam̐bŏdalīni