Emta vedugo tanagu yevvarumtaa neramgadu

ఎంత వేడుకో తనకు యెవ్వరుంటా నెరఁగదు
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకో తనకు యెవ్వరుంటా నెరఁగదు
దొంతర వలపులను తొంగి చూచీ నిన్నును

(॥ఎంత॥)
నవ్వుతానే నీ మోము నలినాక్షి చూచి చూచి
వువ్విళ్లూరీ లోలోనే వుమ్మగిలుతా
పువ్వులు కొప్పులోనివి బుజముపై రాలఁగాను
జవ్వనపు మదముతో జంకించీ నిన్నును

(॥ఎంత॥)
మాఁటలాడుతానే నీ మర్మములు ముట్టి ముట్టి
గూఁటఁబెట్టీ సిగ్గులెల్లా గుబ్బతిల్లుతా
గాఁటపుఁబయ్యద చన్నుఁగవపైనే జారఁగాను
తాఁటించి రాజసముతోఁ దమిరేఁచీ నిన్నును

(॥ఎంత॥)
సన్నలు సేసుకొంటానే సరసము లాడి యాడి
కన్నులనే చొక్కీని కరఁగుకొంటా
ఇన్నిటా శ్రీవేంకటేశ ఇంతలో నీవు గూడఁగా
పన్ని మోవితేనె లూరఁ బచారించీ నిన్నును

(||pallavi||)
ĕṁta veḍugo tanagu yĕvvaruṁṭā nĕram̐gadu
dŏṁtara valabulanu tŏṁgi sūsī ninnunu

(||ĕṁta||)
navvudāne nī momu nalinākṣhi sūsi sūsi
vuvviḽlūrī lolone vummagiludā
puvvulu kŏppulonivi bujamubai rālam̐gānu
javvanabu madamudo jaṁkiṁchī ninnunu

(||ĕṁta||)
mām̐ṭalāḍudāne nī marmamulu muṭṭi muṭṭi
gūm̐ṭam̐bĕṭṭī siggulĕllā gubbadilludā
gām̐ṭabum̐bayyada sannum̐gavabaine jāram̐gānu
tām̐ṭiṁchi rājasamudom̐ damirem̐sī ninnunu

(||ĕṁta||)
sannalu sesugŏṁṭāne sarasamu lāḍi yāḍi
kannulane sŏkkīni karam̐gugŏṁṭā
inniḍā śhrīveṁkaḍeśha iṁtalo nīvu gūḍam̐gā
panni movidenĕ lūram̐ basāriṁchī ninnunu