Emta vedugo neegu yeebe meemdanu

ఎంత వేడుకో నీకు యీపె మీఁదను
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకో నీకు యీపె మీఁదను
వింతలెల్లా జూచి మాకు వెరగయ్యీ నిపుడు

(॥॥)
ప్రియమున నీతోడ ప్రియురాలు మాఁటాడఁగ
ఆముకొని వినేవు నీ వప్పటనుండి
గోమున నేపొద్దు నీకుఁ గొలువులు సేయఁగాను
జామటనుండి యిట్టె సంతోసించేవు

(॥॥)
అప్పటిని బాగాలిచ్చి ఆకుమడిచియ్యఁగాను
వుప్పతిల్లుఁ గళలతో నుబ్బేవు నీవు
చిప్పిలఁగ నిన్నుఁ జూచి సెలవుల నవ్వఁగాను
చెప్పరానితమకానఁ జిమ్మిరేఁగేవు

(॥॥)
నేరుపులెల్లా మెరసి నీకు బాదా లొత్తఁగాను
బోరున నీనిలువెల్ల బులకించేవు
యీరీతి శ్రీ వేంకటేశ యేలితివి నీదేవుల
గారవపురతులనుఁ గడుఁజొక్కేవు

(||pallavi||)
ĕṁta veḍugo nīgu yībĕ mīm̐danu
viṁtalĕllā jūsi māgu vĕragayyī nibuḍu

(||||)
priyamuna nīdoḍa priyurālu mām̐ṭāḍam̐ga
āmugŏni vinevu nī vappaḍanuṁḍi
gomuna nebŏddu nīgum̐ gŏluvulu seyam̐gānu
jāmaḍanuṁḍi yiṭṭĕ saṁtosiṁchevu

(||||)
appaḍini bāgālichchi āgumaḍisiyyam̐gānu
vuppadillum̐ gaḽalado nubbevu nīvu
sippilam̐ga ninnum̐ jūsi sĕlavula navvam̐gānu
sĕpparānidamagānam̐ jimmirem̐gevu

(||||)
nerubulĕllā mĕrasi nīgu bādā lŏttam̐gānu
boruna nīniluvĕlla bulagiṁchevu
yīrīdi śhrī veṁkaḍeśha yelidivi nīdevula
gāravaburadulanum̐ gaḍum̐jŏkkevu