ఎంత వేడుకో నీకు నింతి సేసే సేవలు
(॥పల్లవి॥)
ఎంత వేడుకో నీకు నింతి సేసే సేవలు
చెంతనుండి చూచేమాకు సిబ్బితయ్యీ నిపుడు
(॥ఎంత॥)
కొప్పులోని మొగలి రేకులతావి దొలఁకగాను
చెప్పీ నేకతమునీకు చెవిలోనికే
చిప్పిలుఁజెమటలెల్లా చేతుల జొబ్బలఁగాను
అప్పుడే పాదములొత్తీ నంగ మల్లాఁ దడియ
(॥ఎంత॥)
చెక్కులజవ్వాది నీముఁజేతులపైన వడియఁగా
మొక్కి నీవు చెనకఁగా మోహాన నీకె
పుక్కిటితమ్ములము గొబ్బున నీమైఁ జెదరఁగా
మిక్కిలి నవ్వీఁ గుంచమే కొని విసరుచు
(॥ఎంత॥)
గుబ్బల నలఁగిన కుంకుమ నీమై నంటఁగా
వుబ్బునఁ గాఁగిట నించి వొరసీ నీకె
అబ్బురాన నన్నేలితి వన్నిటా శ్రీవేంకటేశ
నిబ్బరానఁ దానూఁ జేసీ నీకు నూడిగములు
(||pallavi||)
ĕṁta veḍugo nīgu niṁti sese sevalu
sĕṁtanuṁḍi sūsemāgu sibbidayyī nibuḍu
(||ĕṁta||)
kŏppuloni mŏgali reguladāvi dŏlam̐kagānu
sĕppī negadamunīgu sĕvilonige
sippilum̐jĕmaḍalĕllā sedula jŏbbalam̐gānu
appuḍe pādamulŏttī naṁga mallām̐ daḍiya
(||ĕṁta||)
sĕkkulajavvādi nīmum̐jedulabaina vaḍiyam̐gā
mŏkki nīvu sĕnagam̐gā mohāna nīgĕ
pukkiḍidammulamu gŏbbuna nīmaim̐ jĕdaram̐gā
mikkili navvīm̐ guṁchame kŏni visarusu
(||ĕṁta||)
gubbala nalam̐gina kuṁkuma nīmai naṁṭam̐gā
vubbunam̐ gām̐giḍa niṁchi vŏrasī nīgĕ
abburāna nannelidi vanniḍā śhrīveṁkaḍeśha
nibbarānam̐ dānūm̐ jesī nīgu nūḍigamulu