Emta vedugo moha meduvamtido

ఎంత వేడుకో మోహ మెటువంటిదో
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకో మోహ మెటువంటిదో
చెంతలను తనరాక చెప్పకుమనీని

(॥ఎంత॥)
వెన్నెలబాయిటనుండి విభునిపైఁ బదములు
సన్నపు టెలుఁగునను సతి వాడఁగా
కన్నులను నప్పుకొంటాగక్కననాతఁడువచ్చి
సన్న సేసీనే చెలుల చాటున వింటాను

(॥ఎంత॥)
శింగారవనములోన చెలులతో రమణుఁడు
అంగవించిన ముచ్చట లాడుకోఁగాను
యింగితానఁ దానె వచ్చి యింకా నడుగుమంటా
అంగనల నెచ్చరించి ఆడనే దాఁగీని

(॥ఎంత॥)
తరుణి శ్రీవేంకటేశుఁ దలఁచి కప్పురవీడె
నురిది నుపార మిచ్చి యందుకోఁగాను
గరిమె నాతఁడే వచ్చి కని కౌఁగిలించి కూడె
పొరి నాకెగుణములే పొగడుకొంటాను

(||pallavi||)
ĕṁta veḍugo moha mĕḍuvaṁṭido
sĕṁtalanu tanarāga sĕppagumanīni

(||ĕṁta||)
vĕnnĕlabāyiḍanuṁḍi vibhunibaim̐ badamulu
sannabu ṭĕlum̐gunanu sadi vāḍam̐gā
kannulanu nappugŏṁṭāgakkananādam̐ḍuvachchi
sanna sesīne sĕlula sāḍuna viṁṭānu

(||ĕṁta||)
śhiṁgāravanamulona sĕlulado ramaṇum̐ḍu
aṁgaviṁchina muchchaḍa lāḍugom̐gānu
yiṁgidānam̐ dānĕ vachchi yiṁkā naḍugumaṁṭā
aṁganala nĕchchariṁchi āḍane dām̐gīni

(||ĕṁta||)
taruṇi śhrīveṁkaḍeśhum̐ dalam̐si kappuravīḍĕ
nuridi nubāra michchi yaṁdugom̐gānu
garimĕ nādam̐ḍe vachchi kani kaum̐giliṁchi kūḍĕ
pŏri nāgĕguṇamule pŏgaḍugŏṁṭānu