Emta vedugalo yiddarivi

ఎంత వేడుకలో యిద్దరివి
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకలో యిద్దరివి
బంతినే కన్నుల పండుగలాయ

(॥ఎంత॥)
సొలపు మాఁటలు సుదతి యాడఁగా
కలకల నవ్వీఁ గాంతుఁడు
అలముచు సారెకు నాకె వెనఁగఁగా
వలపుల చెమటలు వడిసీ నితఁడు

(॥ఎంత॥)
బొమ్మజంకెనలు పొలఁతి చూపఁగా
నమ్మికలిచ్చీ నాయకుఁడు
తమ్ముల మాకె ముదమున నడుగఁగా
కమ్ముక చిత్తము గరఁగీ నితఁడు

(॥ఎంత॥)
బడి బడిఁ జన్నులు పడఁతి యొత్తఁగా
అడరీ శ్రీవేంకటాధిపుఁడు
అడియాలపురతు లాపె గొసరఁగా
కడుఁదమకంబునఁ గదిసీ నితఁడు

(||pallavi||)
ĕṁta veḍugalo yiddarivi
baṁtine kannula paṁḍugalāya

(||ĕṁta||)
sŏlabu mām̐ṭalu sudadi yāḍam̐gā
kalagala navvīm̐ gāṁtum̐ḍu
alamusu sārĕgu nāgĕ vĕnam̐gam̐gā
valabula sĕmaḍalu vaḍisī nidam̐ḍu

(||ĕṁta||)
bŏmmajaṁkĕnalu pŏlam̐ti sūbam̐gā
nammigalichchī nāyagum̐ḍu
tammula māgĕ mudamuna naḍugam̐gā
kammuga sittamu garam̐gī nidam̐ḍu

(||ĕṁta||)
baḍi baḍim̐ jannulu paḍam̐ti yŏttam̐gā
aḍarī śhrīveṁkaḍādhibum̐ḍu
aḍiyālaburadu lābĕ gŏsaram̐gā
kaḍum̐damagaṁbunam̐ gadisī nidam̐ḍu