ఎంత వేడుకకాఁడవు ఇన్నిటా నీవు
(॥పల్లవి॥)
ఎంత వేడుకకాఁడవు ఇన్నిటా నీవు
సంతసించేవు మోహము చల్లినంతనె
(॥॥)
వన్నెవచ్చె మేనికిని వాడుదేరె మోమెల్ల
కన్నులను నాపె నీవు గాంచినంతనె
చెన్నుమీర సంతోసాన చెక్కులెల్లాఁబులకించె
పన్నుగా నాకెమాటలు విన్నంతనె
(॥॥)
ఆసవుట్టె మనసుకు అరిమురిఁ జెమరించె
సేసవెట్టి యాపె నిన్నుఁ జేరినంతనె
వాసిమీర పైపైనే వలపులు గడుమించె
చేసన్నలు నీయెడకుఁ జేసినంతనె
(॥॥)
నిట్టూరుపులు రేఁగె నిండుఁదమకము నిండె
గుట్టుతోడ నీవు రతిఁ గూడినంతనె
అట్టె శ్రీవేంకటేశ ఆనందము గడునుబ్బె
చుట్టి ఆ కెఆయములు సోఁకినంతనె
(||pallavi||)
ĕṁta veḍugagām̐ḍavu inniḍā nīvu
saṁtasiṁchevu mohamu sallinaṁtanĕ
(||||)
vannĕvachchĕ menigini vāḍuderĕ momĕlla
kannulanu nābĕ nīvu gāṁchinaṁtanĕ
sĕnnumīra saṁtosāna sĕkkulĕllām̐bulagiṁchĕ
pannugā nāgĕmāḍalu vinnaṁtanĕ
(||||)
āsavuṭṭĕ manasugu arimurim̐ jĕmariṁchĕ
sesavĕṭṭi yābĕ ninnum̐ jerinaṁtanĕ
vāsimīra paibaine valabulu gaḍumiṁchĕ
sesannalu nīyĕḍagum̐ jesinaṁtanĕ
(||||)
niṭṭūrubulu rem̐gĕ niṁḍum̐damagamu niṁḍĕ
guṭṭudoḍa nīvu radim̐ gūḍinaṁtanĕ
aṭṭĕ śhrīveṁkaḍeśha ānaṁdamu gaḍunubbĕ
suṭṭi ā kĕāyamulu som̐kinaṁtanĕ