ఎంత వేడుకకాఁడవో యీపెకు నీవు
(॥పల్లవి॥)
ఎంత వేడుకకాఁడవో యీపెకు నీవు
అంతరంగమెల్లా మాకు నానతీవయ్యా
(॥॥)
కాంతకానుక యంత కనుపట్టి వుండెనో
అంతటిలోఁ చేయిచాఁచె వందరిలోన
బంతి నాపెసరస మేపాటి మేన నంటెనో
వింతయి మోముకళల విఱ్ఱవీఁగేవు
(॥॥)
చెలియపలుకు లెంత చెవిసోఁకి వుండెనో
అలరి యప్పటి మాఁట లడిగేవు
మలసి యాపెచూపు మర్మము లెట్లంటెనో
తలపోసి రతులకుఁ దమకించేవు
(॥॥)
మగువవలపు లెంత మనసునఁ బట్టెనో
నగి నగి సారెసారె నంటుచూపేవు
జిగి నన్నుఁ గూడితివి శ్రీ వేంకటేశ నేఁడు
పొగడి యాపెను నాతోఁ బురుఁడు వెట్టేవు
(||pallavi||)
ĕṁta veḍugagām̐ḍavo yībĕgu nīvu
aṁtaraṁgamĕllā māgu nānadīvayyā
(||||)
kāṁtagānuga yaṁta kanubaṭṭi vuṁḍĕno
aṁtaḍilom̐ seyisām̐sĕ vaṁdarilona
baṁti nābĕsarasa mebāḍi mena naṁṭĕno
viṁtayi momugaḽala viṭravīm̐gevu
(||||)
sĕliyabalugu lĕṁta sĕvisom̐ki vuṁḍĕno
alari yappaḍi mām̐ṭa laḍigevu
malasi yābĕsūbu marmamu lĕṭlaṁṭĕno
talabosi radulagum̐ damagiṁchevu
(||||)
maguvavalabu lĕṁta manasunam̐ baṭṭĕno
nagi nagi sārĕsārĕ naṁṭusūbevu
jigi nannum̐ gūḍidivi śhrī veṁkaḍeśha nem̐ḍu
pŏgaḍi yābĕnu nādom̐ burum̐ḍu vĕṭṭevu