Emta vedugagaamda vemiseppedi

ఎంత వేడుకకాఁడ వేమిచెప్పేది
Language

(॥పల్లవి॥)
ఎంత వేడుకకాఁడ వేమిచెప్పేది
అంతే పో నేరుపరి వౌదువయ్య నీవు

(॥॥)
చిక్కనివి నవ్వులు చిమ్మిరేఁగేవి సిగ్గులు
చక్కఁగ మాతోనేల జాణతనాలు
లక్కబుఱ్ఱవంటినోరు లలిఁ బగడపుమోవి
పిక్కటిల్ల గంటిసేయఁ బెనఁగేవు నీవు

(॥॥)
గట్టులివి చన్నులు కడుబయలు నడుము
నెట్టన మాతోనేల నెరతనాలు
దట్టపు మేఘము కొప్పు దంతికుంభాలు పిరుఁదు
ముట్టి సరసములాడ మొనసేవు నీవు

(॥॥)
పసని తీగె మేను పాయరానివి యాసలు
యెసగి మాతోనేల యేలాటాలు
వసమై నన్నేలితివి వాసితో శ్రీవేంకటేశ
పొసఁగె నన్నిటా నన్ను బొదిగేవు నీవు

(||pallavi||)
ĕṁta veḍugagām̐ḍa vemisĕppedi
aṁte po nerubari vauduvayya nīvu

(||||)
sikkanivi navvulu simmirem̐gevi siggulu
sakkam̐ga mādonela jāṇadanālu
lakkabuṭravaṁṭinoru lalim̐ bagaḍabumovi
pikkaḍilla gaṁṭiseyam̐ bĕnam̐gevu nīvu

(||||)
gaṭṭulivi sannulu kaḍubayalu naḍumu
nĕṭṭana mādonela nĕradanālu
daṭṭabu meghamu kŏppu daṁtiguṁbhālu pirum̐du
muṭṭi sarasamulāḍa mŏnasevu nīvu

(||||)
pasani tīgĕ menu pāyarānivi yāsalu
yĕsagi mādonela yelāḍālu
vasamai nannelidivi vāsido śhrīveṁkaḍeśha
pŏsam̐gĕ nanniḍā nannu bŏdigevu nīvu