Emta vani kemta vani yidi yemtide

ఎంత వని కెంత వని యిది యేఁటిదే
Language

(॥పల్లవి॥)
ఎంత వని కెంత వని యిది యేఁటిదే
పంతమె సతుల కిది పాలతోడఁ బోసిరో

(॥ఎంత॥)
నవ్వుతా నే నన్నందున నాలి నెగ్గు సేసుకొని
యివ్వల నట్టె మాటాడే విది యేమె
పువ్వువంటి యాఁట దైతేఁ బొగరు ముంపుఁదనమె
నివ్వటిల్లునో కాక నీకే తెలసునే

(॥ఎంత॥)
తప్పక చూచినందుకే తగఁ గోపము సేసుక
కొప్పు దువ్వినఁ గసరుకొనే వేమే
చిప్పిల జవ్వని యైతె చెంది యాడ లేని వాసు
లెప్పు డెం దుండి వచ్చునో యెరఁగమే నేము

(॥ఎంత॥)
సరస మాడినందుకె చాల నలుక సేసుక
వొరసి చేయి వట్టిన నులికే వేమే
యిర వైన శ్రీవెంటేశుడ నిన్నుఁ గూడితి
గరిమె నిచ్చగించితి కడు మేలె నీవు

(||pallavi||)
ĕṁta vani kĕṁta vani yidi yem̐ṭide
paṁtamĕ sadula kidi pāladoḍam̐ bosiro

(||ĕṁta||)
navvudā ne nannaṁduna nāli nĕggu sesugŏni
yivvala naṭṭĕ māḍāḍe vidi yemĕ
puvvuvaṁṭi yām̐ṭa daidem̐ bŏgaru muṁpum̐danamĕ
nivvaḍilluno kāga nīge tĕlasune

(||ĕṁta||)
tappaga sūsinaṁduge tagam̐ gobamu sesuga
kŏppu duvvinam̐ gasarugŏne veme
sippila javvani yaidĕ sĕṁdi yāḍa leni vāsu
lĕppu ḍĕṁ duṁḍi vachchuno yĕram̐game nemu

(||ĕṁta||)
sarasa māḍinaṁdugĕ sāla naluga sesuga
vŏrasi seyi vaṭṭina nulige veme
yira vaina śhrīvĕṁṭeśhuḍa ninnum̐ gūḍidi
garimĕ nichchagiṁchidi kaḍu melĕ nīvu