Emta valasinado yeebe neegu

ఎంత వలచినదో యీపె నీకు
Language

(॥పల్లవి॥)
ఎంత వలచినదో యీపె నీకు
ఇంతేసి ప్రియాలు చెప్పీ నియ్యకొనరాదా

(॥ఎంత॥)
చిత్తడిచెమట గార సిగ్గులు లోలో జార
బత్తితోఁ బాదాలొత్తీఁ బడఁతి నీకు
బిత్తరిచూపులతోడఁ బెనుఁగొప్పు గొంత వీడ
హత్తి నీకు విడెమిచ్చీ నందుకోరాదా

(॥ఎంత॥)
పువ్వులదండలు వేల పులకలు మేనఁ దేల
వువ్విళ్లూర సేవసేసీ నువిద నీకు
నవ్వులు సెలవి నూర ననుపులు గడుమీర
నివ్వటిల్ల మాటలాడీ నీవు వినరాదా

(॥ఎంత॥)
చన్నులు గానరాఁగా జవ్వనము మించిరాఁగా
వన్నెపచ్చడము గప్పీ వనిత నీకు
ఇన్నిటా శ్రీవేంకటేశ యీకె యలమేలుమంగ
నిన్నుఁ గూడి మెచ్చుమెచ్చీ నీవూ మెచ్చరాదా

(||pallavi||)
ĕṁta valasinado yībĕ nīgu
iṁtesi priyālu sĕppī niyyagŏnarādā

(||ĕṁta||)
sittaḍisĕmaḍa gāra siggulu lolo jāra
battidom̐ bādālŏttīm̐ baḍam̐ti nīgu
bittarisūbuladoḍam̐ bĕnum̐gŏppu gŏṁta vīḍa
hatti nīgu viḍĕmichchī naṁdugorādā

(||ĕṁta||)
puvvuladaṁḍalu vela pulagalu menam̐ dela
vuvviḽlūra sevasesī nuvida nīgu
navvulu sĕlavi nūra nanubulu gaḍumīra
nivvaḍilla māḍalāḍī nīvu vinarādā

(||ĕṁta||)
sannulu gānarām̐gā javvanamu miṁchirām̐gā
vannĕbachchaḍamu gappī vanida nīgu
inniḍā śhrīveṁkaḍeśha yīgĕ yalamelumaṁga
ninnum̐ gūḍi mĕchchumĕchchī nīvū mĕchcharādā