Emta valaduvo kaani yeedanigini

ఎంత వలతువో కాని యీతనికిని
Language

(॥పల్లవి॥)
ఎంత వలతువో కాని యీతనికిని
చింతలెల్లఁ జిగిరించి చిమ్మిరేఁగెనే

(॥॥)
చక్కనినీరమణుఁడు సరసము లాడితేను
లక్కవంటినీమనసు లలిఁ గరఁగి
చెక్కులపై చెమటలు చీరుమోవితేనెలు
వొక్కమాటే చెలరేఁగి వూట్లెత్తెనే

(॥॥)
మచ్చికతో నీమగఁడు మాఁటలాడీనంతలోనె
పచ్చినీజవ్వనమెల్ల పదనెక్కి
పచ్చని మెయిపులకలు బాగుగా మోముకళలు
విచ్చనవిడిఁ దోడుతో వెదలై మొలచెనే

(॥॥)
యెన్నఁగ శ్రీ వేంకటేశుఁడిట్టె నిన్నుఁ గూడఁగాను
చన్నులై నీవురమున నెన్నులు వెళ్ళి
కన్నులఁ జూచేకాంక్షలు కాఁగిటిలోనిరతులు
పన్ని యిరువంక నొక్కపరే రాసులాయనే

(||pallavi||)
ĕṁta valaduvo kāni yīdanigini
siṁtalĕllam̐ jigiriṁchi simmirem̐gĕne

(||||)
sakkaninīramaṇum̐ḍu sarasamu lāḍidenu
lakkavaṁṭinīmanasu lalim̐ garam̐gi
sĕkkulabai sĕmaḍalu sīrumovidenĕlu
vŏkkamāḍe sĕlarem̐gi vūṭlĕttĕne

(||||)
machchigado nīmagam̐ḍu mām̐ṭalāḍīnaṁtalonĕ
pachchinījavvanamĕlla padanĕkki
pachchani mĕyibulagalu bāgugā momugaḽalu
vichchanaviḍim̐ doḍudo vĕdalai mŏlasĕne

(||||)
yĕnnam̐ga śhrī veṁkaḍeśhum̐ḍiṭṭĕ ninnum̐ gūḍam̐gānu
sannulai nīvuramuna nĕnnulu vĕḽḽi
kannulam̐ jūsegāṁkṣhalu kām̐giḍiloniradulu
panni yiruvaṁka nŏkkabare rāsulāyane