Emta valabimchidivo yemi maaya sesidivo

ఎంత వలపించితివో యేమి మాయ సేసితివో
Language

(॥పల్లవి॥)
ఎంత వలపించితివో యేమి మాయ సేసితివో
పంతములాడుదుఁగాని పాయలేనురా

(॥॥)
కోపగించేనంటా వచ్చి గొబ్బున నీమోము చూచి
దాపుగా నే మొగమోడి తలవంతురా
పోపోమ్మని యలిగి నేఁ బోయేనంటాఁబోయి
తీపునీమోవి దలఁచి తిరుగుదురా

(॥॥)
వెంగెమాడేనంటాఁ జూచి వినయాల నినుఁ గని
కుంగుచు నానిట్టూర్పు గక్కుకొందురా
వుంగిటినీమాట నీకే వొప్పగించేనంటా వచ్చి
నింగి మోవఁ జేతులెత్తి నేనే మొక్కుదురా

(॥॥)
మిక్కిలి వింతరేకులు మేననెల్లా సోదించి
గక్కుననే నుండరేక కాఁగిలింతురా
పక్కన శ్రీ వేంకటేశ బాసగొనేనంటా వచ్చి
యెక్కువతో నిన్నుఁ గూడి ఇన్ని మఱచితిరా

(||pallavi||)
ĕṁta valabiṁchidivo yemi māya sesidivo
paṁtamulāḍudum̐gāni pāyalenurā

(||||)
kobagiṁchenaṁṭā vachchi gŏbbuna nīmomu sūsi
dābugā ne mŏgamoḍi talavaṁturā
pobommani yaligi nem̐ boyenaṁṭām̐boyi
tībunīmovi dalam̐si tirugudurā

(||||)
vĕṁgĕmāḍenaṁṭām̐ jūsi vinayāla ninum̐ gani
kuṁgusu nāniṭṭūrbu gakkugŏṁdurā
vuṁgiḍinīmāḍa nīge vŏppagiṁchenaṁṭā vachchi
niṁgi movam̐ jedulĕtti nene mŏkkudurā

(||||)
mikkili viṁtaregulu menanĕllā sodiṁchi
gakkunane nuṁḍarega kām̐giliṁturā
pakkana śhrī veṁkaḍeśha bāsagŏnenaṁṭā vachchi
yĕkkuvado ninnum̐ gūḍi inni maṟasidirā