ఎంత వడి మేలములు యింతితోడఁ జూపేవు
(॥పల్లవి॥)
ఎంత వడి మేలములు యింతితోడఁ జూపేవు
చెంతనే కాఁగిట నిట్టె చేకొనవయ్యా
(॥ఎంత॥)
పెనఁగి పెనఁగి నీకు ప్రియములు చెప్పఁగాను
విని యియ్యకొనవయ్య వెలఁదిమాఁట
తనివోవ కప్పటిని తప్పక చూచీ నిన్ను
నినుపుగా ముందరను నిలుచుండవయ్యా
(॥ఎంత॥)
చెలరేఁగి నవ్వినవ్వి చెక్కునొక్కి వేఁడుకోఁగా
అలమి కాఁగిట నించవయ్యా నీవును
వలగొని నీకు మొక్కీ వలపులు చల్లీని
లలి నీ వన్నిటా నేఁడు లాలించవయ్యా
(॥ఎంత॥)
మెచ్చిమెచ్చి నీగుణాలు మిక్కిలినిఁ బొగడఁగ
కొచ్చి యలమేలమంగఁ గూడితివయ్యా
యిచ్చట శ్రీవేంకటేశ యీకె నిన్నుఁగొసరీని
పచ్చిదేరి వేడుకలు భావించవయ్యా
(||pallavi||)
ĕṁta vaḍi melamulu yiṁtidoḍam̐ jūbevu
sĕṁtane kām̐giḍa niṭṭĕ segŏnavayyā
(||ĕṁta||)
pĕnam̐gi pĕnam̐gi nīgu priyamulu sĕppam̐gānu
vini yiyyagŏnavayya vĕlam̐dimām̐ṭa
tanivova kappaḍini tappaga sūsī ninnu
ninubugā muṁdaranu nilusuṁḍavayyā
(||ĕṁta||)
sĕlarem̐gi navvinavvi sĕkkunŏkki vem̐ḍugom̐gā
alami kām̐giḍa niṁchavayyā nīvunu
valagŏni nīgu mŏkkī valabulu sallīni
lali nī vanniḍā nem̐ḍu lāliṁchavayyā
(||ĕṁta||)
mĕchchimĕchchi nīguṇālu mikkilinim̐ bŏgaḍam̐ga
kŏchchi yalamelamaṁgam̐ gūḍidivayyā
yichchaḍa śhrīveṁkaḍeśha yīgĕ ninnum̐gŏsarīni
pachchideri veḍugalu bhāviṁchavayyā