ఎంత వడి కెంత వడి యేమి దలఁచుకొంటివో
(॥పల్లవి॥)
ఎంత వడి కెంత వడి యేమి దలఁచుకొంటివో
యింత వొలిసీ నొల్లము లెరఁగ దాచెలియా
(॥ఎంత వడి॥)
అప్పుడె మావిన్నపము లవధరించినవాఁడ
విప్పు డేల అడిగేవు యిం కొక్కమాఁటు
వుప్పరిగలోన నుండి వువిద నిన్ను రమ్మని
చెప్పి రమ్మన్నది యింతే చిక్కిన వెరఁగము
(॥ఎంత వడి॥)
కచ్చుపెట్టి యల్లప్పుడె కాను కందితివి మాచే
వచ్చినప నడిగేవు వడి నిప్పుడు
విచ్చేయు మనుచు నింతి వెస గొంగువట్టు మని
యిచ్చె మాకు సెల వింతే యి దేమి నెరగఁదు
(॥ఎంతపడి॥)
ముందె నేము రాఁగాను ముంచి నవ్వినవాఁడవు
యిందుముఖిసుద్దు లిప్పుడే లడిగేవు
కందువ శ్రీవెంకటేశ కలసె నాపె విచ్చేసి
విందు నీకుఁ జెప్పు మనె వేరు సేయ నేరదు
(||pallavi||)
ĕṁta vaḍi kĕṁta vaḍi yemi dalam̐sugŏṁṭivo
yiṁta vŏlisī nŏllamu lĕram̐ga dāsĕliyā
(||ĕṁta vaḍi||)
appuḍĕ māvinnabamu lavadhariṁchinavām̐ḍa
vippu ḍela aḍigevu yiṁ kŏkkamām̐ṭu
vupparigalona nuṁḍi vuvida ninnu rammani
sĕppi rammannadi yiṁte sikkina vĕram̐gamu
(||ĕṁta vaḍi||)
kachchubĕṭṭi yallappuḍĕ kānu kaṁdidivi māse
vachchinaba naḍigevu vaḍi nippuḍu
vichcheyu manusu niṁti vĕsa gŏṁguvaṭṭu mani
yichchĕ māgu sĕla viṁte yi demi nĕragam̐du
(||ĕṁtabaḍi||)
muṁdĕ nemu rām̐gānu muṁchi navvinavām̐ḍavu
yiṁdumukhisuddu lippuḍe laḍigevu
kaṁduva śhrīvĕṁkaḍeśha kalasĕ nābĕ vichchesi
viṁdu nīgum̐ jĕppu manĕ veru seya neradu