(॥పల్లవి॥)
ఎంత వడేయ నిదేమమ్మా
దొంతి రతులకు నెదురుచూచీని
(॥ఎంత॥)
అలికులవేణి యంబుజపాణి
కలికి మగువ రాఁగదవమ్మా
మలయజగంధి మదనవిలాసిని
కలయికలకు పతి గాచుకున్నాఁడు
(॥ఎంత॥)
సామజగమనా చక్కెరబొమ్మా
కామిని యిఁక రాఁగదవమ్మా
భామాతిలకమ పసిఁడిసలాకా
నీమగఁ డదివో నిలుచుకున్నాఁడు
(॥ఎంత॥)
వొడికపు నెలఁతా వొప్పులకుప్పా
కడఁకలసతి రాఁగదవమ్మా
గుడిగొని తెరలోఁ గూడె నిన్నపుడు
యెడయక శ్రీవేంకటేశుఁ డున్నాఁడు
(||pallavi||)
ĕṁta vaḍeya nidemammā
dŏṁti radulagu nĕdurusūsīni
(||ĕṁta||)
aligulaveṇi yaṁbujabāṇi
kaligi maguva rām̐gadavammā
malayajagaṁdhi madanavilāsini
kalayigalagu padi gāsugunnām̐ḍu
(||ĕṁta||)
sāmajagamanā sakkĕrabŏmmā
kāmini yim̐ka rām̐gadavammā
bhāmādilagama pasim̐ḍisalāgā
nīmagam̐ ḍadivo nilusugunnām̐ḍu
(||ĕṁta||)
vŏḍigabu nĕlam̐tā vŏppulaguppā
kaḍam̐kalasadi rām̐gadavammā
guḍigŏni tĕralom̐ gūḍĕ ninnabuḍu
yĕḍayaga śhrīveṁkaḍeśhum̐ ḍunnām̐ḍu