(॥పల్లవి॥)
ఎంత వాఁడి సేసేవేరా మమ్ము
కంతుని యమ్ముల కట్టలమా
(॥ఎంత॥)
ఆసపడి నీయంగము లంటితే
వోసరించి లోఁగేవు వొడ్డుకొంటా
దోసమెఱఁగవు తొయ్యలుల పొందు
సే సేమంటే చేతఁ జిక్కవద్దా
(॥ఎంత॥)
మరిగి నీమోవి మనసయ్యీనంటే
శిరసు వంచేవు సిగ్గుతోడ
సరవులెంచవు సతుల వలపు
పరగించేమంటే పలుకవద్దా
(॥ఎంత॥)
కూడి మాడి చన్నులకొనల నొత్తితే
వాడేవు యలసి వత్తి వలె
యీడనె శ్రీ వేంకటేశ నీదేవుల
మీకు వెనఁగితి మెంచవద్దా
(||pallavi||)
ĕṁta vām̐ḍi seseverā mammu
kaṁtuni yammula kaṭṭalamā
(||ĕṁta||)
āsabaḍi nīyaṁgamu laṁṭide
vosariṁchi lom̐gevu vŏḍḍugŏṁṭā
dosamĕṟam̐gavu tŏyyalula pŏṁdu
se semaṁṭe sedam̐ jikkavaddā
(||ĕṁta||)
marigi nīmovi manasayyīnaṁṭe
śhirasu vaṁchevu siggudoḍa
saravulĕṁchavu sadula valabu
paragiṁchemaṁṭe palugavaddā
(||ĕṁta||)
kūḍi māḍi sannulagŏnala nŏttide
vāḍevu yalasi vatti valĕ
yīḍanĕ śhrī veṁkaḍeśha nīdevula
mīgu vĕnam̐gidi mĕṁchavaddā