Emta vaaduvade neeshvarumdu

ఎంత వాటువడె నీశ్వరుఁడు
Language

(॥పల్లవి॥)
ఎంత వాటువడె నీశ్వరుఁడు
జంతువుల కేది సతమోకాని

(॥ఎంత॥)
వోముచు లోలో నొకదేహమునకె
యేమి రచించెను యీశ్వరుఁడు
కామించి మోక్షసుఖమునకునైతే
వోమిన స్రిష్టులు వొకటీఁ గావు

(॥ఎంత॥)
భోగించ బుట్టిన భూతకోట్లను
యేగతి మోఁచీ నీశ్వరుఁడు
చేగదేర తనసేవకుఁ జొచ్చిన-
యోగము సులభం బొకటొకటికిని

(॥ఎంత॥)
పన్నిన జగములు ప్రాణాధారము
యెన్నిట నున్నాఁ డీశ్వరుఁడు
కన్నుల శ్రీవేంకటపతియని కని
వున్నవేళ తమ వునికే సుఖము

(||pallavi||)
ĕṁta vāḍuvaḍĕ nīśhvarum̐ḍu
jaṁtuvula kedi sadamogāni

(||ĕṁta||)
vomusu lolo nŏgadehamunagĕ
yemi rasiṁchĕnu yīśhvarum̐ḍu
kāmiṁchi mokṣhasukhamunagunaide
vomina sriṣhṭulu vŏgaḍīm̐ gāvu

(||ĕṁta||)
bhogiṁcha buṭṭina bhūdagoṭlanu
yegadi mom̐sī nīśhvarum̐ḍu
segadera tanasevagum̐ jŏchchina-
yogamu sulabhaṁ bŏgaḍŏgaḍigini

(||ĕṁta||)
pannina jagamulu prāṇādhāramu
yĕnniḍa nunnām̐ ḍīśhvarum̐ḍu
kannula śhrīveṁkaḍabadiyani kani
vunnaveḽa tama vunige sukhamu