Emta tamagimchevu yemoyi

ఎంత తమకించేవు యేమోయి
Language

(॥పల్లవి॥)
ఎంత తమకించేవు యేమోయి
మంతనమాడేనంటా మారు మలసేవు

(॥ఎంత॥)
నిగిడి యలిగితినా నీకు నీవే వేగిరించి
నగనైతినంటా గోరు నాటించేవు
యెగసెక్కెపుదాననా యేమేమో భావించి
మొగము వంచితినంటా ముంగురులంటేవు

(॥ఎంత॥)
చలము సాదించేనా సరి నింతలో నింటికిఁ
బిలువనంటాఁ జన్నులు పిసికేవు
బలిమికత్తెనా నీతో పంతముగ నూరకైనా
పలుకనాఁ గొంగువట్టి తీసేవు

(॥ఎంత॥)
వాసితోఁ గాఁగిలించనా వట్టినెపములు వేసి
రాసి యలసితినంటా రవ్వసేసేవు
ఆసల శ్రీవేంకటేశ అలమేల్మంగనే నేను
వేసారనంటా నన్ను వేడుకతో మెచ్చేవు

(||pallavi||)
ĕṁta tamagiṁchevu yemoyi
maṁtanamāḍenaṁṭā māru malasevu

(||ĕṁta||)
nigiḍi yaligidinā nīgu nīve vegiriṁchi
naganaidinaṁṭā goru nāḍiṁchevu
yĕgasĕkkĕbudānanā yememo bhāviṁchi
mŏgamu vaṁchidinaṁṭā muṁgurulaṁṭevu

(||ĕṁta||)
salamu sādiṁchenā sari niṁtalo niṁṭigim̐
biluvanaṁṭām̐ jannulu pisigevu
balimigattĕnā nīdo paṁtamuga nūragainā
paluganām̐ gŏṁguvaṭṭi tīsevu

(||ĕṁta||)
vāsidom̐ gām̐giliṁchanā vaṭṭinĕbamulu vesi
rāsi yalasidinaṁṭā ravvasesevu
āsala śhrīveṁkaḍeśha alamelmaṁgane nenu
vesāranaṁṭā nannu veḍugado mĕchchevu