ఎంత తమకమో చెలి కేమి చెప్పేది
(॥పల్లవి॥)
ఎంత తమకమో చెలి కేమి చెప్పేది
వింత వింత వేడుకలు వెల్లి విరిసీని
(॥ఎంత॥)
సారె జారుఁబయ్యదతో సగముచన్నులు చూపి
నేరుపుల మాట లాడీ నెలఁత నీతో
కూరుములు గొసరుతా గోరఁ జెమట చిమ్ముతా
తారుమారై వలపుల తన్నుఁ దా నెఱుఁగదు
(॥ఎంత॥)
కడు గొప్పు దువ్వుకొంటా కరమూలములు చూపి
వెడయాస నవ్వు నవ్వీ వెలఁది నీతో
నిడువాలుఁజూపులతో నిన్నుఁ దా నొరసుకొంటా
తడబాటుచిత్తముతో తన్నుఁ దా నెఱుఁగదు
(॥ఎంత॥)
బిగ్గె నొడ్డాణము గట్టి పిఱదిబటువు చూపి
అగ్గలమై కాలు దొక్కీ నతివ నీతో
నిగ్గుల శ్రీవేంకటేశ నిన్నుఁ గూడీ మొక్కు మొక్కి
తగ్గని కోర్కులతోడ తన్నుఁ దా నెఱుఁగదు
(||pallavi||)
ĕṁta tamagamo sĕli kemi sĕppedi
viṁta viṁta veḍugalu vĕlli virisīni
(||ĕṁta||)
sārĕ jārum̐bayyadado sagamusannulu sūbi
nerubula māḍa lāḍī nĕlam̐ta nīdo
kūrumulu gŏsarudā goram̐ jĕmaḍa simmudā
tārumārai valabula tannum̐ dā nĕṟum̐gadu
(||ĕṁta||)
kaḍu gŏppu duvvugŏṁṭā karamūlamulu sūbi
vĕḍayāsa navvu navvī vĕlam̐di nīdo
niḍuvālum̐jūbulado ninnum̐ dā nŏrasugŏṁṭā
taḍabāḍusittamudo tannum̐ dā nĕṟum̐gadu
(||ĕṁta||)
biggĕ nŏḍḍāṇamu gaṭṭi piṟadibaḍuvu sūbi
aggalamai kālu dŏkkī nadiva nīdo
niggula śhrīveṁkaḍeśha ninnum̐ gūḍī mŏkku mŏkki
taggani korguladoḍa tannum̐ dā nĕṟum̐gadu