ఎంత తమకమే నీకు నీతఁ డిట్టే కూడీఁగాక
(॥పల్లవి॥)
ఎంత తమకమే నీకు నీతఁ డిట్టే కూడీఁగాక
పంతపు నీభావమేల పచ్చి చేసుకొనేవే
(॥॥)
మలయుచుఁ బతితోడ మాటలు నాడఁగానే
చెలియరో నీమేనెంత చెమరించీనే
చలివాసి యతఁడు నీసంగడి నుండఁగానే
చెలఁగి నిట్టూర్పులఁ జిమ్మిరేఁగీనే
(॥॥)
ననిచి యాతనితోడ నవ్వులు నవ్వుతానే
వనిత నీవింతలోనే వావిచెప్పవే
కొనచూపుల నాతఁడు కొచ్చి నిన్నుఁ జూడఁగానే
ఇనుమడించినమోహమెంత యాఁపేవే
(॥॥)
వొలిసి శ్రీవేంకటేశునురమున నుండఁగానే
అలమేలుమంగవు నీవాసవెంచేవే
పలురతుల నాతఁడు బలిమితోఁ గూడఁగానే
కలికితనము లెంత కడుమెరనేవే
(||pallavi||)
ĕṁta tamagame nīgu nīdam̐ ḍiṭṭe kūḍīm̐gāga
paṁtabu nībhāvamela pachchi sesugŏneve
(||||)
malayusum̐ badidoḍa māḍalu nāḍam̐gāne
sĕliyaro nīmenĕṁta sĕmariṁchīne
salivāsi yadam̐ḍu nīsaṁgaḍi nuṁḍam̐gāne
sĕlam̐gi niṭṭūrbulam̐ jimmirem̐gīne
(||||)
nanisi yādanidoḍa navvulu navvudāne
vanida nīviṁtalone vāvisĕppave
kŏnasūbula nādam̐ḍu kŏchchi ninnum̐ jūḍam̐gāne
inumaḍiṁchinamohamĕṁta yām̐peve
(||||)
vŏlisi śhrīveṁkaḍeśhunuramuna nuṁḍam̐gāne
alamelumaṁgavu nīvāsavĕṁcheve
paluradula nādam̐ḍu balimidom̐ gūḍam̐gāne
kaligidanamu lĕṁta kaḍumĕraneve