ఎంత తమకపడేవు యింతలో నేవిూ
(॥పల్లవి॥)
ఎంత తమకపడేవు యింతలో నేవిూ
వింత చవి వుట్టించితే వెఱపా యేవిూ
(॥ఎంత॥)
కౌఁగిలించి రతి నిన్నుఁగరఁగించి నీమోము
తోఁగి చూచి నవ్వేవు దోసమా యేమి
మాఁగిన నీమోవి యిచ్చి మాటలు ని న్నా డించితే
కాఁగి బూతులఁ దిట్టేవు కాదా యేమీ
(॥ఎంత॥)
మదనయుద్దపువేళ మనసు చూడవలసి
కదిలితే జంకించేవు కడమా యేమి
అదన నీ బుసకొట్టు అలకించి విన బోతే
యిదివో పరాకయ్యేవు యెఱుఁగవా యేమి
(॥ఎంత॥)
వుండుండి శ్రీవేంకటేశ వుసరిసురతవేళ
నండనే కన్నులు మూసినందుకా యేమి
నిండుదేహపురసాలు నీమీఁదఁ జిందితేను
దండిగా సిగ్గు వడేవు నగవా యేమి
(||pallavi||)
ĕṁta tamagabaḍevu yiṁtalo neviూ
viṁta savi vuṭṭiṁchide vĕṟabā yeviూ
(||ĕṁta||)
kaum̐giliṁchi radi ninnum̐garam̐giṁchi nīmomu
tom̐gi sūsi navvevu dosamā yemi
mām̐gina nīmovi yichchi māḍalu ni nnā ḍiṁchide
kām̐gi būdulam̐ diṭṭevu kādā yemī
(||ĕṁta||)
madanayuddabuveḽa manasu sūḍavalasi
kadilide jaṁkiṁchevu kaḍamā yemi
adana nī busagŏṭṭu alagiṁchi vina bode
yidivo parāgayyevu yĕṟum̐gavā yemi
(||ĕṁta||)
vuṁḍuṁḍi śhrīveṁkaḍeśha vusarisuradaveḽa
naṁḍane kannulu mūsinaṁdugā yemi
niṁḍudehaburasālu nīmīm̐dam̐ jiṁdidenu
daṁḍigā siggu vaḍevu nagavā yemi