ఏఁట తలఁ పేఁటి పొందు యిస్సీ రోఁతరా
(॥పల్లవి॥)
ఏఁట తలఁ పేఁటి పొందు యిస్సీ రోఁతరా
ఆఁటదాని బతు కెల్ల ఆగడమె ఆయఁగా
(॥ఏటి తల॥)
చిత్తము రావలె నంటాఁ జెప్పిన ట్టెల్లఁ జేసితి
హత్తి యేమిటాఁ గరఁగ వయ్యో యేలరా
పొత్తుకు రానైతి నంటా వూఁచి కోపించుకొంటివి
యిత్తల నీ నా పొందులు యింతలోని వాయఁగా
(॥ఏటి తల॥)
చనవరి నయ్యే నంటా సర వెల్ల నడపితి
మనసులో తమకాలు మాన వేలరా
మునుపె నే నవ్వ నంటా మోము ముడుచుకొంటివి
వెనకటి నామే లెల్ల వేరే వేరే ఆయరా
(॥ఏటి తల॥)
కందువ నెరవు లేక కాఁపుర మెల్ల జేసితి
యిందులోన మెచ్చఁ జాల వింకా నేలరా
విందువలె నేఁటిదో శ్రీవెంకటేశ కూడితివి
చెందిన నా ఆయము నీ చేతికి లో నాయఁగా
(||pallavi||)
em̐ṭa talam̐ pem̐ṭi pŏṁdu yissī rom̐tarā
ām̐ṭadāni badu kĕlla āgaḍamĕ āyam̐gā
(||eḍi tala||)
sittamu rāvalĕ naṁṭām̐ jĕppina ṭṭĕllam̐ jesidi
hatti yemiḍām̐ garam̐ga vayyo yelarā
pŏttugu rānaidi naṁṭā vūm̐si kobiṁchugŏṁṭivi
yittala nī nā pŏṁdulu yiṁtaloni vāyam̐gā
(||eḍi tala||)
sanavari nayye naṁṭā sara vĕlla naḍabidi
manasulo tamagālu māna velarā
munubĕ ne navva naṁṭā momu muḍusugŏṁṭivi
vĕnagaḍi nāme lĕlla vere vere āyarā
(||eḍi tala||)
kaṁduva nĕravu lega kām̐pura mĕlla jesidi
yiṁdulona mĕchcham̐ jāla viṁkā nelarā
viṁduvalĕ nem̐ṭido śhrīvĕṁkaḍeśha kūḍidivi
sĕṁdina nā āyamu nī sedigi lo nāyam̐gā