Emta takkareem deedani nemamdune

ఎంత తక్కరీఁ డీతని నేమందునే
Language

(॥పల్లవి॥)
ఎంత తక్కరీఁ డీతని నేమందునే
బంతినే నాకు వలపు పంచి పెట్టీని

(॥ఎంత॥)
చెలిఁ దాను బాసలుచేసుకోఁగా నే వచ్చితే
కెలన నన్నందుకే సాకిరివెట్టీనే
నిలిచి నే నంతలోనె నివ్వెరగుతో నుండితే
కలుపుకోలుతనాలు గలుగఁజేసీనే

(॥ఎంత॥)
వొక్కపొత్తున నిద్దరు నుండఁగా నే వచ్చితే
చిక్కించు కెంగిలిలో నాచేతులద్దీనే
తక్కక నే మొగమోటఁ దలవంచుకొంటేను
వొక్కటిగాఁ జుట్టరిక మొనరఁ జెప్పీనే

(॥ఎంత॥)
ఆకెఁ దానుఁ గాఁగిట నలరఁగ నే వచ్చితే
కోక నామీఁదఁ గప్పి కొంకుదేర్చీనే
ఆకుమడిచిచ్చీ నాపె అలమేలుమంగ నేను
యీకడ శ్రీవేంకటేశుఁ డీతఁడే నన్నేలెనే

(||pallavi||)
ĕṁta takkarīm̐ ḍīdani nemaṁdune
baṁtine nāgu valabu paṁchi pĕṭṭīni

(||ĕṁta||)
sĕlim̐ dānu bāsalusesugom̐gā ne vachchide
kĕlana nannaṁduge sāgirivĕṭṭīne
nilisi ne naṁtalonĕ nivvĕragudo nuṁḍide
kalubugoludanālu galugam̐jesīne

(||ĕṁta||)
vŏkkabŏttuna niddaru nuṁḍam̐gā ne vachchide
sikkiṁchu kĕṁgililo nāseduladdīne
takkaga ne mŏgamoḍam̐ dalavaṁchugŏṁṭenu
vŏkkaḍigām̐ juṭṭariga mŏnaram̐ jĕppīne

(||ĕṁta||)
āgĕm̐ dānum̐ gām̐giḍa nalaram̐ga ne vachchide
koga nāmīm̐dam̐ gappi kŏṁkudersīne
āgumaḍisichchī nābĕ alamelumaṁga nenu
yīgaḍa śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍe nannelĕne