ఎంత తపము చేసితో యీకెకుఁ గాను
(॥పల్లవి॥)
ఎంత తపము చేసితో యీకెకుఁ గాను
మంతుకెక్క నీకుఁ గల్గె మంచిపెండ్లిఁకూతురు
(॥ఎంత॥)
చన్నులే చిన్నలుగాని సతిమోహము ఘనము
కన్నులు గొప్పలు నవ్వు కడుఁగొంచెము
కన్నెపడు చింతెకాని కడలేని చేఁతలు
ఇన్నిటా నీకు గలిగె నిదె పెండ్లికూఁతురు
(॥ఎంత॥)
చేరఁడే మొగముగాని సిగ్గయితేఁ చేటఁడు
బారెడేసి నెరులు చెప్పరాదు గుట్టు
యీరీతి ముగుదగాని యెమ్మెలు కోటానఁగోటి
కోరినట్టే కలిగె నీకునుఁ బెండ్లికూఁతురు
(॥ఎంత॥)
పాదాలే చిగురుగాని భావమెల్లా నిండుఁజేగ
భేదాలు మోవులు మాట ప్రియ మొక్కటే
యీ దెస శ్రీ వెంకటేశ యీకె యలమేల్‌మంగ
నీ దేవులై నినుఁగూడె నిచ్చఁ బెండ్లికూఁతురు
(||pallavi||)
ĕṁta tabamu sesido yīgĕgum̐ gānu
maṁtugĕkka nīgum̐ galgĕ maṁchibĕṁḍlim̐kūduru
(||ĕṁta||)
sannule sinnalugāni sadimohamu ghanamu
kannulu gŏppalu navvu kaḍum̐gŏṁchĕmu
kannĕbaḍu siṁtĕgāni kaḍaleni sem̐talu
inniḍā nīgu galigĕ nidĕ pĕṁḍligūm̐turu
(||ĕṁta||)
seram̐ḍe mŏgamugāni siggayidem̐ seḍam̐ḍu
bārĕḍesi nĕrulu sĕpparādu guṭṭu
yīrīdi mugudagāni yĕmmĕlu koḍānam̐goḍi
korinaṭṭe kaligĕ nīgunum̐ bĕṁḍligūm̐turu
(||ĕṁta||)
pādāle sigurugāni bhāvamĕllā niṁḍum̐jega
bhedālu movulu māḍa priya mŏkkaḍe
yī dĕsa śhrī vĕṁkaḍeśha yīgĕ yalamelmaṁga
nī devulai ninum̐gūḍĕ nichcham̐ bĕṁḍligūm̐turu