Emta taalimigaladi yeemaguva

ఎంత తాలిమిగలది యీమగువ
Language

(॥పల్లవి॥)
ఎంత తాలిమిగలది యీమగువ
వింతలు సేయక నిన్ను వేఁడుకొనెను

(॥ఎంత॥)
యెనలేనిచేఁతలు నీవేమేమి సేసినాను
ననుపుసేసుక ఆపె నవ్వు నవ్వెను
కొనబుతనాన మరి గురు లెన్నియుండినాను
చనవుసేసుక మోవి చవిగొనెను

(॥ఎంత॥)
కడనుండి యెందురేసికాంతలఁ దెచ్చుకొన్నాను
బడిబడి నీమీఁద బత్తిసేసెను
తడవుగా నాడనుండి తగ నిప్పుడు వచ్చినా
వొడివట్టి తీసి నీతో నొనగూడెను

(॥ఎంత॥)
పోరచి తమ్ములము నీపుక్కిటనే వుండఁగాను
గారవించి కాఁగిటఁ గలసె నిన్ను
యీరీతి శ్రీవేంకటేశ యెంత రతిసేసినాను
ఆరయ నోపననక అట్టె సమ్మతించెను

(||pallavi||)
ĕṁta tālimigaladi yīmaguva
viṁtalu seyaga ninnu vem̐ḍugŏnĕnu

(||ĕṁta||)
yĕnalenisem̐talu nīvememi sesinānu
nanubusesuga ābĕ navvu navvĕnu
kŏnabudanāna mari guru lĕnniyuṁḍinānu
sanavusesuga movi savigŏnĕnu

(||ĕṁta||)
kaḍanuṁḍi yĕṁduresigāṁtalam̐ dĕchchugŏnnānu
baḍibaḍi nīmīm̐da battisesĕnu
taḍavugā nāḍanuṁḍi taga nippuḍu vachchinā
vŏḍivaṭṭi tīsi nīdo nŏnagūḍĕnu

(||ĕṁta||)
porasi tammulamu nībukkiḍane vuṁḍam̐gānu
gāraviṁchi kām̐giḍam̐ galasĕ ninnu
yīrīdi śhrīveṁkaḍeśha yĕṁta radisesinānu
āraya nobananaga aṭṭĕ sammadiṁchĕnu