Emta suttamogaani yaabe neegu

ఎంత చుట్టమోకాని యాపె నీకు
Language

(॥పల్లవి॥)
ఎంత చుట్టమోకాని యాపె నీకు
వింత వింత వేడుకల విందుచెప్పీ నీకును

(॥ఎంత॥)
తొంగిచూచి యాకె నిన్నుఁ దొరలఁగ మాటలాడి
అంగన విలిచి వీడెమందుకొమ్మనీ
ముంగిట కప్పటి వచ్చి ముంజేయివట్టి తీసి
చెంగటఁ గూచుండఁ బెట్టి సెవలెల్లఁ జేసెను

(॥ఎంత॥)
పన్నీరు చల్లిచల్లి పాదాలుగడిగి నీకు
చన్నుల పై మొత్తుకొని సారెఁ బూజించీ
కన్నులనే మొక్కుమొక్కి కాఁగిట యాసలు చూపి
ఆన్నిటాఁ జెప్పరాని ప్రియములెల్లాఁ జెప్పెను

(॥ఎంత॥)
ఆరగించఁజేసి నీకు నండఁ బానుపు వరచి
కోరి బాగాలొసఁగి యాకులు చుట్టిచ్చీ
చేరి నీవు గూడఁగాను శ్రీవేంకటేశుఁడ నేఁడు
నేరుపులెల్లా మెరసి నిన్నిట్టె మెప్పించెను

(||pallavi||)
ĕṁta suṭṭamogāni yābĕ nīgu
viṁta viṁta veḍugala viṁdusĕppī nīgunu

(||ĕṁta||)
tŏṁgisūsi yāgĕ ninnum̐ dŏralam̐ga māḍalāḍi
aṁgana vilisi vīḍĕmaṁdugŏmmanī
muṁgiḍa kappaḍi vachchi muṁjeyivaṭṭi tīsi
sĕṁgaḍam̐ gūsuṁḍam̐ bĕṭṭi sĕvalĕllam̐ jesĕnu

(||ĕṁta||)
pannīru sallisalli pādālugaḍigi nīgu
sannula pai mŏttugŏni sārĕm̐ būjiṁchī
kannulane mŏkkumŏkki kām̐giḍa yāsalu sūbi
ānniḍām̐ jĕpparāni priyamulĕllām̐ jĕppĕnu

(||ĕṁta||)
āragiṁcham̐jesi nīgu naṁḍam̐ bānubu varasi
kori bāgālŏsam̐gi yāgulu suṭṭichchī
seri nīvu gūḍam̐gānu śhrīveṁkaḍeśhum̐ḍa nem̐ḍu
nerubulĕllā mĕrasi ninniṭṭĕ mĕppiṁchĕnu