ఎంత చుట్టమో నీకు నిదివో ఆపె
(॥పల్లవి॥)
ఎంత చుట్టమో నీకు నిదివో ఆపె
సంతసపు వలపుల జడిసీ నాపె
(॥ఎంత॥)
తేనెగారే పెదవుల తేటమాఁటలాడీ నాపె
నానఁబెట్టి సెలువుల నవ్వీ నాపె
సానఁబెట్టినచూపులు జళపించీ నీపై నాపె
మోనముతో బొమ్మలను మొక్కీ నాపె
(॥ఎంత॥)
నిండుఁ జెక్కుటద్దములనీడలు చూపీ నాపె
గండుఁడుమ్మిదకొప్పుతోఁ గదిమీ నాపె
కొండలవంటిచన్నులకొనలు దాఁకించీ నాపె
మెండుఁజిగురుచేతుల మెచ్చు మెచ్చీనాపె
(॥ఎంత॥)
ఆయపు మెఱుఁగుమేన ఆసలురేఁచీ నాపె
పాయపుసిగ్గులచేత భ్రమించీ నాపె
మోయరానిపిఱుఁదుల మురిపెముచూపీ నాపె
యీయెడ శ్రీవేంకటేశ యెనసె నిన్నాపె
(||pallavi||)
ĕṁta suṭṭamo nīgu nidivo ābĕ
saṁtasabu valabula jaḍisī nābĕ
(||ĕṁta||)
tenĕgāre pĕdavula teḍamām̐ṭalāḍī nābĕ
nānam̐bĕṭṭi sĕluvula navvī nābĕ
sānam̐bĕṭṭinasūbulu jaḽabiṁchī nībai nābĕ
monamudo bŏmmalanu mŏkkī nābĕ
(||ĕṁta||)
niṁḍum̐ jĕkkuḍaddamulanīḍalu sūbī nābĕ
gaṁḍum̐ḍummidagŏppudom̐ gadimī nābĕ
kŏṁḍalavaṁṭisannulagŏnalu dām̐kiṁchī nābĕ
mĕṁḍum̐jigurusedula mĕchchu mĕchchīnābĕ
(||ĕṁta||)
āyabu mĕṟum̐gumena āsalurem̐sī nābĕ
pāyabusiggulaseda bhramiṁchī nābĕ
moyarānibiṟum̐dula muribĕmusūbī nābĕ
yīyĕḍa śhrīveṁkaḍeśha yĕnasĕ ninnābĕ