Emta sulugamgam joose vemayya neevu

ఎంత చులుకఁగఁ జూచే వేమయ్య నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత చులుకఁగఁ జూచే వేమయ్య నీవు
కాంత నీపై వలపులు గడ్డెము వేసీనా

(॥ఎంత॥)
చనవు గలుగఁగానుసారెకుఁ గొసరీ నింతి
మనసు నీకురాకున్నమాటలాడీనా
చెనక రాఁగా నీచేతులుదాఁబట్టెఁగాక
వెనవెనకకుఁ బోతే వెన్నడించీనా

(॥ఎంత॥)
సమ్మతించి నీవుండఁగాసరసమాదె నీపె
కొమ్మ నీకువేసటైతే గోర గీరినా
రమ్మనఁగా నీతొడవై రమణి గూచుండెఁగాక
వుమ్మడి నీ వూరకుంటే వొద్దికి వచ్చీనా

(॥ఎంత॥)
కందువకునీవు రాఁగాఁ గాఁగిలించుకొనెఁ జెలి
పొందునీకు లేకుందితే భోగించీనా
విందుగా మోవియ్యఁగా శ్రీవేంకటేశ కూడెఁగాక
సందడి బరాకైతేచలపట్టీనా

(||pallavi||)
ĕṁta sulugam̐gam̐ jūse vemayya nīvu
kāṁta nībai valabulu gaḍḍĕmu vesīnā

(||ĕṁta||)
sanavu galugam̐gānusārĕgum̐ gŏsarī niṁti
manasu nīgurāgunnamāḍalāḍīnā
sĕnaga rām̐gā nīseduludām̐baṭṭĕm̐gāga
vĕnavĕnagagum̐ bode vĕnnaḍiṁchīnā

(||ĕṁta||)
sammadiṁchi nīvuṁḍam̐gāsarasamādĕ nībĕ
kŏmma nīguvesaḍaide gora gīrinā
rammanam̐gā nīdŏḍavai ramaṇi gūsuṁḍĕm̐gāga
vummaḍi nī vūraguṁṭe vŏddigi vachchīnā

(||ĕṁta||)
kaṁduvagunīvu rām̐gām̐ gām̐giliṁchugŏnĕm̐ jĕli
pŏṁdunīgu leguṁdide bhogiṁchīnā
viṁdugā moviyyam̐gā śhrīveṁkaḍeśha kūḍĕm̐gāga
saṁdaḍi barāgaidesalabaṭṭīnā