ఎంత చూచితే నేము ఇద్దరికి హితలము
(॥పల్లవి॥)
ఎంత చూచితే నేము ఇద్దరికి హితలము
కంచపు మోవుల గలగలపాయ వలపు
(॥ఎంచి॥)
యింతి నీయవసర మెరిఁగిరా నంపె నన్ను
కాంత నీవు నున్నారు గద్దెమీఁదను
అంతలోనే రేఁ(రెం?)ట దెప్పలాయను మీవలపులు
వింత సుద్దు లింకేమని విన్నవింతునయ్యా
(॥ఎంచి॥)
తరుణి నన్నంపె నీ తలఁపు దెలియుమని
పరిమళము వూసెవు పడఁతికిని
సరిబేసులైయున్నవి సంగడి మీ వలపులు
వెరవుతో నేమని విన్నవింతునయ్యా
(॥ఎంచి॥)
అలివేణి నిన్నుఁ జూడనంపె శ్రీవేంకటేశుఁడ
అలమేలుమంగ వున్నదక్కున నీకు
కలసితివి ముప్పిరిగా నీపెను వలపులు
వెలసితి రేమని విన్నవింతునయ్యా
(||pallavi||)
ĕṁta sūside nemu iddarigi hidalamu
kaṁchabu movula galagalabāya valabu
(||ĕṁchi||)
yiṁti nīyavasara mĕrim̐girā naṁpĕ nannu
kāṁta nīvu nunnāru gaddĕmīm̐danu
aṁtalone rem̐(rĕṁ?)ṭa dĕppalāyanu mīvalabulu
viṁta suddu liṁkemani vinnaviṁtunayyā
(||ĕṁchi||)
taruṇi nannaṁpĕ nī talam̐pu dĕliyumani
parimaḽamu vūsĕvu paḍam̐tigini
saribesulaiyunnavi saṁgaḍi mī valabulu
vĕravudo nemani vinnaviṁtunayyā
(||ĕṁchi||)
aliveṇi ninnum̐ jūḍanaṁpĕ śhrīveṁkaḍeśhum̐ḍa
alamelumaṁga vunnadakkuna nīgu
kalasidivi muppirigā nībĕnu valabulu
vĕlasidi remani vinnaviṁtunayyā