ఎంత సింగారించుకొంటి విప్పుడు నీవు
(॥పల్లవి॥)
ఎంత సింగారించుకొంటి విప్పుడు నీవు
చింతించఁ జక్కఁదనమే సింగారము గాదా
(॥॥)
కాంత నీవు నిమ్మపండ్లు గాను కియ్యవలెనా
బంతి నీచన్నులే నిమ్మ పండ్లుగావా
పొంత నందుకుఁ దామరపూవుల వేయవలెనా
చెంతఁజూచేనీకన్నులే చెందామరలు గావా
(॥॥)
కలికి నీవప్పటిని కప్ర మంపవలెనా
కలగొన్న నవ్వులే కప్రాలు గావా
తెలిసి నీమాఁటల తీపులు చల్లవలెనా
తిలకింప మోవితేనే తీపులు గావా
(॥॥)
వనిత యింటికిఁ బిలువఁగ నింతవలెనా
యెనసితే నీపయ్యదే యిల్లుగాదా
చెనకి యలమేల్మంగ శ్రీవేంకటేశుఁడఁ దాను
కని మొక్కవలెనా నీకాఁగిలే మొక్కు గాదా
(||pallavi||)
ĕṁta siṁgāriṁchugŏṁṭi vippuḍu nīvu
siṁtiṁcham̐ jakkam̐daname siṁgāramu gādā
(||||)
kāṁta nīvu nimmabaṁḍlu gānu kiyyavalĕnā
baṁti nīsannule nimma paṁḍlugāvā
pŏṁta naṁdugum̐ dāmarabūvula veyavalĕnā
sĕṁtam̐jūsenīgannule sĕṁdāmaralu gāvā
(||||)
kaligi nīvappaḍini kapra maṁpavalĕnā
kalagŏnna navvule kaprālu gāvā
tĕlisi nīmām̐ṭala tībulu sallavalĕnā
tilagiṁpa movidene tībulu gāvā
(||||)
vanida yiṁṭigim̐ biluvam̐ga niṁtavalĕnā
yĕnaside nībayyade yillugādā
sĕnagi yalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ḍam̐ dānu
kani mŏkkavalĕnā nīgām̐gile mŏkku gādā