Emta simgaarimcheve yeme neevu

ఎంత సింగారించేవే యేమే నీవు
Language

(॥పల్లవి॥)
ఎంత సింగారించేవే యేమే నీవు
కాంతుఁడు వాకిట వచ్చి కాచుకున్నాఁడు

(॥ఎంత॥)
చెలులకు వెడవెడసిగ్గులే సింగారము
సెలవులకు నవ్వులే సింగారము
పలచనిమోవికి పలుకులే సింగారము
కలికిన్నులకును సోలుపే సింగారము

(॥ఎంత॥)
చక్కనిబొమ్మలకును జంకెనలే సింగారము
చెక్కులకు మురిపెమే సింగారము
వెక్కసపుగొళ్లకు విసరులే సింగారము
చొక్కపుజవ్వనానకు సోంపులే సింగారము

(॥ఎంత॥)
కఱకుచన్నులకును కాఁగిలే సింగారము
చిఱుఁదొడలకు రతి సింగారము
మఱి యలమేలుమంగమగఁడు శ్రీవేంకటేశుఁ-
డెఱీఁగి నిన్నిట్టె కూడె నిదే సింగారము

(||pallavi||)
ĕṁta siṁgāriṁcheve yeme nīvu
kāṁtum̐ḍu vāgiḍa vachchi kāsugunnām̐ḍu

(||ĕṁta||)
sĕlulagu vĕḍavĕḍasiggule siṁgāramu
sĕlavulagu navvule siṁgāramu
palasanimovigi palugule siṁgāramu
kaliginnulagunu solube siṁgāramu

(||ĕṁta||)
sakkanibŏmmalagunu jaṁkĕnale siṁgāramu
sĕkkulagu muribĕme siṁgāramu
vĕkkasabugŏḽlagu visarule siṁgāramu
sŏkkabujavvanānagu soṁpule siṁgāramu

(||ĕṁta||)
kaṟagusannulagunu kām̐gile siṁgāramu
siṟum̐dŏḍalagu radi siṁgāramu
maṟi yalamelumaṁgamagam̐ḍu śhrīveṁkaḍeśhum̐-
ḍĕṟīm̐gi ninniṭṭĕ kūḍĕ nide siṁgāramu